Chinnareddy: తేదీ ఫిక్స్‌ చేయ్.. ఎక్కడైనా, ఎప్పుడైనా.. నిరంజన్‌కు చిన్నారెడ్డి సవాల్

ABN , First Publish Date - 2023-08-01T14:51:15+05:30 IST

వనపర్తి నియోజకవర్గం అభివృద్ధిపై మంత్రి నిరంజన్ రెడ్డికి మాజీ మంత్రి జిల్లెల చిన్నారెడ్డి సవాల్ విసిరారు.

Chinnareddy: తేదీ ఫిక్స్‌ చేయ్.. ఎక్కడైనా, ఎప్పుడైనా.. నిరంజన్‌కు చిన్నారెడ్డి సవాల్

వనపర్తి: వనపర్తి నియోజకవర్గం అభివృద్ధిపై మంత్రి నిరంజన్ రెడ్డికి (Minister Niranjan reddy) మాజీ మంత్రి జిల్లెల చిన్నారెడ్డి (Former Minister Jillela Chinnareddy) సవాల్ విసిరారు. నియోజకవర్గం అభివృద్ధి, అవినీతిపై చర్చకు తాము సిద్ధమని... తేదీ ఫిక్స్ చేసి చెప్పాలని ఎక్కడైనా, ఎప్పుడైనా అంటూ ఛాలెంజ్ విసిరారు. ‘‘2014 కు ముందు నీ ఆస్తులు ఎంత ఇప్పుడు ఎంత. అవినీతిలో రాష్ట్రంలోనే నెంబర్ 1 మంత్రి నిరంజన్ రెడ్డి. మా హయాంలో జరిగిన అభివృద్ధి పనులకు రంగులు వేసి నేనే చేశానని ప్రచారం చేసుకుంటున్నావు. నీ హయాంలో జరిగింది మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజీలు మాత్రమే. కనిపించిన ఖాళీ జాగాలన్ని కబ్జా చేస్తున్నది ఎవరు.. చివరకు గుడి మాన్యాలు కూడా వదలడం లేదు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు’’ అంటూ చిన్నారెడ్డి హెచ్చరించారు.

Updated Date - 2023-08-01T14:51:15+05:30 IST