Bandi Sanjay: రాష్ట్రంలో మార్పు జరగాల్సిందేనని ప్రజలు కోరుకుంటున్నారు..

ABN , First Publish Date - 2023-01-24T12:40:40+05:30 IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) అధ్యక్షతన ప్రారంభమైన బీజేపీ (BJP) రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు రెండవ రోజు మంగళవారం కొనసాగుతున్నాయి.

Bandi Sanjay: రాష్ట్రంలో మార్పు జరగాల్సిందేనని ప్రజలు కోరుకుంటున్నారు..

మహబూబ్ నగర్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) అధ్యక్షతన ప్రారంభమైన బీజేపీ (BJP) రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు రెండవ రోజు మంగళవారం కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ జేపీ నాడ్డ (JP Nadda) జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఈ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగిన బీజేపీ విజయ దుందుభి మోగిస్తోందని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రజా సంగ్రామ యాత్రలో టీఆర్ఎస్ (TRS), బీఆర్ఎస్ (BRS) ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రభుత్వంపై ప్రజలందరిలో పూర్తి వ్యతిరేకత వ్యక్తమైందన్నారు. రాష్ట్రంలో ప్రజలు పూర్తి నిరాశ, నిస్పృహ, ఆందోళనలో ఉన్నారని, ప్రజల్లో ఆత్మవిశ్వాసం, భరోసా కల్పించే పార్టీ బీజేపీ అని ప్రజలు భావిస్తున్నారన్నారు. అన్ని వర్గాలు, ప్రతిపక్ష పార్టీలను అణిచివేయలన్నదే బీఆర్ఎస్ పార్టీ సిద్దాంతమని, రాష్ట్రంలో మార్పు జరగాల్సిందేనని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.

బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కుటుంబ పాలన రాచరిక పాలన కొనసాగుతోందని, అందుకే రామ రాజ్యం రావాలని ప్రజలు కోరుతున్నారని బండి సంజయ్ అన్నారు. దళిత బంధు పేరుమీద కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే అమలుచేస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అన్ని వర్గాలను నిర్వీర్యం చేసే పనిలో ఉన్నారని విమర్శించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా 50 వేల ఉద్యోగలకు నోటిఫికేషన్ వేస్తామని మాయమాటలు చెప్పడమే తప్ప ఇప్పటి వరకూ ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్లు వేయలేదని దుయ్యబట్టారు. ధనిక రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల రూపాయల అప్పు రాష్ట్రంగా మార్చారని, కాళేశ్వరం పేరుమీదే లక్ష కోట్లు అప్పు చేశారని ఆరోపించారు.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ బడ్జెట్ సమవేశాలను నిర్వహించి అదాయనికి మించి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టబోతున్నారని, అది రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టేందుకు మాత్రమేనని బండి సంజయ్ అన్నారు. గవర్న

లేకుండానే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి గవెర్నర్ వ్యవస్థను అవమానిస్తున్నారన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి విషయంలో చర్చలకు వచ్చిన తర్వాతే దేశం గురించి మాట్లాడాలని బండి సంజయ్ అన్నారు.

Updated Date - 2023-01-24T12:40:43+05:30 IST