Share News

KTR: 18, 19తేదీల్లో ఖమ్మం జిల్లాలో కేటీఆర్‌ రోడ్‌షోలు

ABN , First Publish Date - 2023-11-15T13:38:56+05:30 IST

ఉమ్మడి జిల్లాలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థు విజయం కోసం ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, పురపాలక, ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు

KTR: 18, 19తేదీల్లో ఖమ్మం జిల్లాలో కేటీఆర్‌ రోడ్‌షోలు

- కొత్తగూడెం, భద్రాచలం, ఇల్లెందు, ఖమ్మంలో ప్రచారం

- ఏర్పాట్లు చేస్తున్న బీఆర్‌ఎస్‌ శ్రేణులు

ఖమ్మం(ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/కొత్తగూడెం: ఉమ్మడి జిల్లాలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థు విజయం కోసం ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, పురపాలక, ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు(Minister K. Taraka Rama Rao) రంగంలోకి దిగుతున్నారు. ఈమేరకు ఆయన రోడ్‌షోల షెడ్యూల్‌ను విడుదల చేశారు. తొలుత 18న సాయంత్రం కొత్తగూడెం, 19న ఉదయం 11గంటలకు భద్రాచలం, మధ్యాహ్నం 1గంటకు ఇల్లెందు, అదేరోజు సాయంత్రం 3గంటలకు ఖమ్మం(Khammam)లో రోడ్‌షోలకు హాజరవుతారు. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల్లోని తమ పార్టీ అభ్యర్థులు వనమా వెంకటేశ్వరరావు, తెల్లం వెంకటరావు, బాణోత్‌ హరిప్రియ, పువ్వాడ అజయ్‌కుమార్‌ విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం చేయనున్నారు. ఈ రెండురోజుల పాటు ఉమ్మడిజిల్లాలో జరిగే కేటీఆర్‌ రోడ్‌షోల కోసం బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-11-15T13:38:58+05:30 IST