Share News

Kishan Reddy : టికెట్ల కేటాయింపుల్లో తర్జన భర్జన

ABN , First Publish Date - 2023-10-28T18:18:24+05:30 IST

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ( Kishan Reddy ) కి సికింద్రాబాద్ పార్లమెంట్ తలనొప్పిగా మారింది.

 Kishan Reddy : టికెట్ల కేటాయింపుల్లో  తర్జన భర్జన

హైదరాబాద్: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ( Kishan Reddy ) కి సికింద్రాబాద్ పార్లమెంట్ తలనొప్పిగా మారింది. నియోజకవర్గంలో ఖైరతాబాద్‌కు మాత్రమే బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది. మిగిలిన ఆరు నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపిక తలనొప్పిగా మారింది. ఒక్కో నియోజకవర్గం నుంచి టికెట్ కోసం ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పార్లమెంట్ పరిధిలో రెండు సీట్లు బీసీలకు ఇవ్వల్సిందేనంటోన్న కిషన్‌రెడ్డి ఢిల్లీ అధిష్ఠానానికి తెలిపారు. సికింద్రాబాద్ టికెట్‌ను మేకల సారంగపాణి, బండా కార్తీకరెడ్డి ఆశిస్తున్నారు. జూబ్లీహిల్స్ నుంచి డాక్టర్ పద్మ వీరపనేని, లంకల దీపక్‌రెడ్డి.. సనత్‌ నగర్ టికెట్‌ను మర్రి శశిధర్‌రెడ్డి, ఆకుల విజయ ఆశిస్తున్నారు. ముషిరాబాద్ టికెట్ కోసం బండారు విజయలక్ష్మీ, గోపాల్‌రెడ్డి మధ్య పోటీ ఉంది. అంబరుపేట టికెట్ రేసులో గౌతంరావు, కృష్ణాయాదవ్, ప్రకాష్ రెడ్డిలు ఉన్నారు. నాంపల్లి సీటును సీనియర్ నేత రాములకు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. బూబ్లీహిల్స్, ముషీరాబాద్, అంబరుపేట నియోజకవర్గాల నుంచి ఏదొక స్థానాన్ని విక్రమ్ గౌడ్ ఆశిస్తున్నారు. గోషామహాల్ సీటు రాజాసింగ్‌కు ఇచ్చిన నేపథ్యంలో.. విక్రమ్‌గౌడ్‌కు సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఏదొక స్థానాన్ని కేటాయించే అవకాశం ఉన్నట్లు విశ్వాసనీయ సమాచారం.

Updated Date - 2023-10-28T18:18:24+05:30 IST