Khammam: చంద్రబాబు అక్రమ అరెస్టుపై... మోత మోగించారు..
ABN , First Publish Date - 2023-10-01T12:26:16+05:30 IST
టీడీపీ అధినే నారా చంద్రబాబునాయుడి(Nara Chandrababu Naidu) అరెస్టును నిరసిస్తూ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, నారా బ్రాహ్మణి ఇచ్చిన పిలుపు
- ఇరు జిల్లాల్లో శబ్ధంతో నిరసన తెలిపిన టీడీపీ శ్రేణులు
- చంద్రబాబు అరెస్టును ఖండించిన నేతలు
ఖమ్మం: టీడీపీ అధినే నారా చంద్రబాబునాయుడి(Nara Chandrababu Naidu) అరెస్టును నిరసిస్తూ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, నారా బ్రాహ్మణి ఇచ్చిన పిలుపు మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శనివారం రాత్రి 7గంటలకు మోతమోగిద్దాం కార్యక్రమాన్ని టీడీపీ శ్రేణులు నిర్వహించాయి. ఖమ్మంలో టీడీపీ నాయకులు తాళ్లూరి జీవన్‌కుమార్ ఆధ్వర్యంలో పళ్లాలను మోగిస్తూ నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు వాసిరెడ్డి రామనాథం, నాయకులు కేతినేని హరీష్, మల్లెంపాటి అప్పారావు, కొండబాల కోటేశ్వరరావు, ఇతరుల ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయం వద్ద విజిల్స్, పళ్లాలను శబ్దం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. పెద్దసంఖ్యలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు చంద్రబాబు అరె్‌స్టను ఖండించారు. కార్యక్రమంలో నల్లమల రంజిత్, నున్నా నవీన్‌చౌదరి, మందపల్లి రజని, తదితరులు పాల్గొన్నారు. మధిరలోనూ టీడీపీ నాయకులు మోతమోగించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు తమ ఇళ్లలో పళ్లాలతో శబ్దం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. వైరా, ఏన్కూరులో ఎంపీపీ ఆరెం వరలక్ష్మీ ఆధ్వర్యంలో మోతమోగించే కార్యక్రమన్ని నిర్వహించారు. టీడీపీ కొత్తగూడెం నియోజకవర్గ ఇంచార్జ్ కనుకుంట్లకుమార్ ఆధ్వర్యంలో కొత్తగూడెం జిల్లా కేంద్రంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు మోతమోగిద్దాం కార్యక్రమాన్ని నిర్వహించారు.
