CM KCR: నేను భారతదేశ బిడ్డను.. మహారాష్ట్రలో బీఆర్ఎస్ రెండో సభలో సీఎం కేసీఆర్

ABN , First Publish Date - 2023-03-26T16:18:46+05:30 IST

మహారాష్ట్రలో మీకేం పని అని మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్ (Fadnavis) అంటున్నారు. భారత పౌరుడిగా ప్రతి రాష్ట్రానికి వెళ్తా. నేను భారతదేశ బిడ్డను

CM KCR: నేను భారతదేశ బిడ్డను.. మహారాష్ట్రలో బీఆర్ఎస్ రెండో సభలో సీఎం కేసీఆర్

మహారాష్ట్ర: ‘‘ మహారాష్ట్రలో మీకేం పని అని మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్ (Fadnavis) అంటున్నారు. భారత పౌరుడిగా ప్రతి రాష్ట్రానికి వెళ్తా. నేను భారతదేశ బిడ్డను’’ అని సీఎం కేసీఆర్‌ (CM KCR) స్పష్టం చేశారు. మహారాష్ట్రంలోని లోహలో బీఆర్‌ఎస్ (BRS) ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ తరహా అభివృద్ధిని ఫడ్నవీస్ చేస్తే.. తాము రాము కదా అని ప్రశ్నించారు. తెలంగాణ తరహా పథకాలు అమలుచేయనంతవరకూ మహారాష్ట్రకు వస్తూనే ఉంటామని ప్రకటించారు. త్వరలోనే రైతుల తుఫాన్‌ రాబోతోంది.. ఎవరూ ఆపలేరని హెచ్చరించారు. మహారాష్ట్ర (Maharashtra)లో దళితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇక్కడ కూడా దళితబంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పార్టీలు, నేతలు మారుతున్నారు కానీ పేదల బతుకులు మారట్లేదని, దేశంలో ప్రజలకు, రైతులకు దక్కింది శూన్యమన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ (BJP Congress) రెండూ ఒక్కటేనని కేసీఆర్‌ ఆరోపించారు. దేశంలో అవసరానికి మించి జలవనరులున్నాయని తెలిపారు. ఏటా 50 టీఎంసీ (TMC)ల నీరు సముద్రంలో కలుస్తోందన్నారు. మహారాష్ట్రలో అనేకచోట్ల తాగునీరు దొరకడం లేదని చెప్పారు. నీళ్లు ఇవ్వడంలేదు కానీ ప్రసంగాలు మాత్రం బాగా చెబుతున్నారని విమర్శించారు. మహారాష్ట్ర ప్రజలు తనతో కలిసి యుద్ధం చేయండి.. నీళ్లు వస్తాయని కేసీఆర్ పిలుపునిచ్చారు.

‘‘దేశంలో 360 బిలియన్‌ టన్నుల బొగ్గు ఉంది. దేశంలోని బొగ్గుతో 150 ఏళ్ల వరకు 24 గంటల విద్యుత్‌ ఇవ్వొచ్చు. పీఎం కిసాన్‌ కింద కేంద్రం రూ.6 వేలు మాత్రమే ఇస్తోంది. పీఎం కిసాన్‌ కింద రైతులకు రూ.10 వేలు ఇవ్వాల్సిందే. ఇక్కడి ఎంపీ, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు?.. జీవితాంతం రైతులు పోరాడాల్సిందేనా? మహారాష్ట్ర పంచాయతీ, జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ పోటీ చేస్తుంది. తెలంగాణ కంటే మహారాష్ట్రలో సంపద ఎక్కువ. తక్కువ సమయంలోనే మహారాష్ట్రను అభివృద్ధి చేయొచ్చు. తెలంగాణ బాగుపడినప్పుడు మహారాష్ట్ర ఎందుకు కాదు?.. ఫసల్‌ బీమా పేరుతో ఆటాలాడుతున్నారు. ఫసల్‌ బీమా ఎవరికైనా అందుతోందా?’’ అని కేసీఆర్ ప్రశ్నించారు.

Updated Date - 2023-03-26T16:51:43+05:30 IST