TS News: మహిళా కానిస్టేబుల్ కూతురు కిడ్నాప్
ABN , First Publish Date - 2023-09-18T10:13:08+05:30 IST
నగరంలోని మధురానగర్‌లో ఓ మహిళ కానిస్టేబుల్ కూతురు కిడ్నాప్ కలకలం రేపుతోంది.

హైదరాబాద్: నగరంలోని మధురానగర్‌లో ఓ మహిళ కానిస్టేబుల్ కూతురు కిడ్నాప్ కలకలం రేపుతోంది. 12 సంవత్సరాల తన కూతురుని ఆంజనేయులు అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడంటూ మధురానగర్ పోలీస్‌స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారు. బాలికకు మాయమాటలు చెప్పి ఇంటి సమీపంలో ఉంటున్న ఆంజనేయులు తీసుకెళ్లాడని బాలిక తల్లి ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన మధురానగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలిక కోసం గాలింపు చర్యలు చేపట్టారు.