Vijayashanti: OTT Platformsకి సెన్సార్ తప్పనిసరి

ABN , First Publish Date - 2023-03-17T22:53:09+05:30 IST

OTT కి ఫిలింసెన్సార్ (Filmcensor) తప్పనిసరిగా కావాలని("It needs Censor for ott platform") బీజేపీ (BJP) సీనియర్ నేత విజయశాంతి (Vijayashanti) అన్నారు.

Vijayashanti: OTT  Platformsకి సెన్సార్ తప్పనిసరి

హైదరాబాద్: OTTకి ఫిలింసెన్సార్ (Filmcensor) తప్పనిసరిగా కావాలని("It needs Strict Censoring for ott platform") బీజేపీ (BJP) సీనియర్ నేత విజయశాంతి (Vijayashanti) అన్నారు. ఈ మధ్యనే విడుదలైన ఒక తెలుగు (బహుబాషా) OTT సిరీస్‌పై రాములమ్మ శుక్రవారం సోషల్ మీడియాలో స్పందించారు. OTTకి సెన్సార్ కావాలనే విషయాన్ని ప్రతి ఒక్కరూ, ప్రత్యేకించి మహిళలు ఈ సమస్యను ఇప్పటికే ఫిలింసెన్సార్ ముందుకు తెస్తున్నారు. ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకోని OTT Platformsలో అసభ్యతతో కూడిన కటెంట్‌ని తొలగించేలా చూడాలని.. లేకపోతే ప్రజా, తీవ్ర మహిళా వ్యతిరేకతతో కూడిన ఉద్యమాల దాకా తెచ్చుకోవద్దని హెచ్చరించారు. సంబంధిత నటులు, నిర్మాతలు Ottలో అశ్లీలంగా ఉండే ప్రసారాలని తొలగించాలని చెప్పారు.భవిష్యత్‌లో దేశవ్యాప్త OTT Platforms ప్రసారాలల్లో ఎక్కడైనా ప్రజల, మహిళా వ్యతిరేకతకు గురయ్యే విధానాలు లేని పద్ధతులు పాటించాలని సూచించారు. నటులకు ప్రజలు ఇచ్చిన అభిమానాన్ని మరింత గౌరవంతో నిలబెట్టుకుంటారని అభిప్రాయపడుతున్నానని విజయశాంతి తెలిపారు.

విజయశాంతి పోస్ట్:

ఈ మధ్యనే విడుదలైన ఒక తెలుగు (బహుబాషా) ott సిరీస్ పై......

"It needs Strict Censoring for ott platform"...

అనే విషయమై అనేకమంది ప్రజలు, ప్రత్యేకించి మహిళలు ఈ సమస్య ముందుకు ఇప్పటికే తెస్తున్నారు.

ప్రజల మనోభావానుసారం నేను చెప్తున్న అంశం అర్థం చేసుకుని, తీవ్ర మహిళా వ్యతిరేకతతో కూడిన ఉద్యమాల దాకా తెచ్చుకోక, సంబంధిత నటులు, మరియు నిర్మాతలు Ott నుండి నిరసించబడుతున్న పై ప్రసారాలని తొలగించి భవిష్యత్‌లో దేశవ్యాప్త ott ప్రసారాలలో ఎక్కడైనా ప్రజా ప్రత్యేకించి మహిళా వ్యతిరేకతకు గురి అయ్యే విధానాలు లేని పద్ధతులు పాటించాలని భావిస్తూ.. తమకు ప్రజలు ఇచ్చిన అభిమానాన్ని, మరింత గౌరవంతో నిలబెట్టుకుంటారని అభిప్రాయపడుతున్నాను.

-విజయశాంతి

Updated Date - 2023-03-18T16:02:58+05:30 IST