VBIT girls morphing photos Issue: పోలీసుల అదుపులో సైబర్ చీటర్

ABN , First Publish Date - 2023-01-06T10:56:13+05:30 IST

నగరంలోని ఘట్కేసర్‌ వీబీఐటీ కళాశాల అమ్మాయిలను వేధింపులకు గురిచేసిన సైబర్ చీటర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

VBIT girls morphing photos Issue: పోలీసుల అదుపులో సైబర్ చీటర్

హైదరాబాద్: నగరంలోని ఘట్కేసర్‌ (Ghatkesar) వీబీఐటీ కళాశాల (Vigyan Bharti Engineering College) అమ్మాయిలను వేధింపులకు (Harassment of girls) గురిచేసిన సైబర్ చీటర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలో (Vijayawada) నిందితుడు ప్రదీప్‌ను అరెస్ట్ చేశారు. హ్యాకర్ (Hacker) మొత్తం ఏడు నెంబర్ల నుంచి అమ్మాయిల ఫోటోలను మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ (Blackmail by morphing photos of girls) చేసినట్లు పోలీసులు గుర్తించారు. కేవలం ఫోటోలు మార్ఫింగ్ మాత్రమే కాకుండా... ఫోన్లో ఉన్న పర్సనల్ డేటా మొత్తాన్ని నిందితుడు హ్యాక్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

కాగా అరెస్ట్ సమయంలో నిందితుడు ప్రదీప్ పోలీసులకు చుక్కలు చూపించాడు. అరెస్ట్‌కు ముందు కూడా అమ్మాయిల ఫోటోలను డార్క్‌నెట్‌లో (Darknet) పెట్టడానికి నిందితుడు పూనుకున్నాడు. సరైన సమయంలో ప్రదీప్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని... మరికొంతమంది అమ్మాయిల భవిష్యత్‌ నాశనం అవ్వకుండా కాపాడారు. వ్యక్తిగత సమాచారాన్ని డార్క్‌నెట్‌లో పెడితే దాని విలువ చాలా వేలు పెట్టీ కొనుగోలు చేస్తారని పోలీసులు వెల్లడించారు.

అమ్మాయిల గొంతు వినపడగానే...

విజయవాడకు చెందిన ప్రదీప్‌తో పాటు మరో ఇద్దరిని ఘట్కేసర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తరచూ ఏదో ఒక నెంబర్లకు ముగ్గురు నిందితులు ఫోన్ చేస్తున్నట్లు గుర్తించారు. అమ్మాయిల గొంతు వినపడగానే ఆ నెంబర్లకు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తూ నిందితులు పరిచయం పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో వాట్సప్ డీపీలుగా ఉన్న ఫోటోలను సేకరించి నిందితులు మార్ఫింగ్ చేస్తున్నట్లు విచారణలో తేలింది.

Updated Date - 2023-01-06T11:22:27+05:30 IST