TS Govt: టీ-వర్క్స్ సీఈవోను తప్పించిన సర్కార్
ABN , Publish Date - Dec 15 , 2023 | 11:20 AM
Telangana: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే కీలక పదువుల్లో ఉన్న వారిని తొలగించడంతో పాటు భారీగా ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ఇప్పుడు తాజాగా టీ-వర్క్స్ సీఈవోను సర్కార్ తప్పించింది. టీ-వర్క్స్ సీఈవో సుజయ్ కారంపురిని రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే కీలక పదువుల్లో ఉన్న వారిని తొలగించడంతో పాటు భారీగా ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ఇప్పుడు తాజాగా టీ-వర్క్స్ సీఈవోను సర్కార్ తప్పించింది. టీ-వర్క్స్ సీఈవో సుజయ్ కారంపురిని రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. టీ-వర్క్స్, టీ-ఫైబర్, ఎలక్ట్రానిక్స్ (ప్రమోషన్స్) డైరెక్టర్‌గా ఉన్న ఆయన్ను తొలగిస్తూ శుక్రవారం ఉదయం ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాజీనామా చేయాలని ప్రభుత్వం కోరినా సుజయ్ తిరస్కరించడంతో ఆయనపై సర్కార్ వేటు వేసింది. టీ-వర్క్స్ కొత్త సీఈవోగా ఆనంద్ రాజ్ గోపాల్, టీ-ఫైబర్ హెడ్గా కాసుల ఆనంద్, ఎలక్ట్రానిక్స్ అండ్ డిజిటల్ వింగ్ హెడ్గా ఎస్‌కే శర్మను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.