Falaknuma Train Accident : ఫలక్‌నుమా ట్రైన్ ప్రమాదంతో పలు రైళ్లు రద్దు

ABN , First Publish Date - 2023-07-07T13:32:54+05:30 IST

ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ ప్రమాదంతో పలు రైళ్లను రద్దు చేయగా.. మరికొన్ని రైళ్లను మళ్లించారు. రామన్నపేట రైల్వే స్టేషన్లో శబరి, నడికుడిలో రేపల్లె సికింద్రాబాద్ రైళ్లను నిలిపివేశారు. జన్మభూమి, నర్సాపుర్ రైళ్లు విజయవాడ మీదుగా మళ్ళించారు. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు రైల్వే అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు.

Falaknuma Train Accident : ఫలక్‌నుమా ట్రైన్ ప్రమాదంతో పలు రైళ్లు రద్దు

యాదాద్రి : ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ ప్రమాదంతో పలు రైళ్లను రద్దు చేయగా.. మరికొన్ని రైళ్లను మళ్లించారు. రామన్నపేట రైల్వే స్టేషన్లో శబరి, నడికుడిలో రేపల్లె సికింద్రాబాద్ రైళ్లను నిలిపివేశారు. జన్మభూమి, నర్సాపుర్ రైళ్లు విజయవాడ మీదుగా మళ్ళించారు. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు రైల్వే అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు. ట్రాక్ క్లియరెన్స్ కోసం మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది.

హౌరా నుంచి సికింద్రాబాద్ వెళుతున్న ఫలక్‌నుమా రైలు (Train No - 12703)లో పెను ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. తొలుత ట్రైన్‌లో షార్ట్ సర్క్యూట్ జరగడం వలన రైలులో మంటలు అలముకున్నాయని అంతా భావించారు. కానీ ఇంతటి విధ్వంసానికి కారణం ఒక సిగిరెట్ అని తెలుస్తోంది. ప్రయాణికులు వద్దని వారించినా వినకుండా ఓ ప్రయాణికుడు ఎస్ 4 బోగీలో చార్జర్ పాయింట్ దగ్గర సిగిరెట్ తాగడంతో ఒక్కసారిగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగిందని సమాచారం.

Updated Date - 2023-07-07T13:32:54+05:30 IST