Share News

Hyderabad: జియాగూడలోయువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2023-11-07T07:55:57+05:30 IST

హైదరాబాద్: కూల్సుంపుర, పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ యువకుడు ఇంట్లో చున్నతో ఫ్యాన్‌ను ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి..

Hyderabad: జియాగూడలోయువకుడి ఆత్మహత్య

హైదరాబాద్: కూల్సుంపుర, పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ యువకుడు ఇంట్లో చున్నతో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.. జియాగూడలోని ఇమాంపురం ప్రాంతానికి చెందిన సి.ప్రేమ్ కుమార్ (18), ఇంటర్ వరకు చదివి ఖాళీగా ఉంటున్నాడు, సోమవారం రాత్రి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు, గమనించిన స్నేహితులు వెంటనే ప్రేమ్‌ కుమార్‌ను ఆసుపత్రి తరలించగా అక్కడ పరీక్షించిన వైద్యులు చనిపోయినట్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువకుడు ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2023-11-07T07:55:59+05:30 IST