Share News

BRS: బీఆర్ఎస్‌లో ఇంకా ఆ మూడు స్థానాలపై వీడని సస్పెన్స్

ABN , First Publish Date - 2023-11-07T14:03:09+05:30 IST

హైదరాబాద్: బీఆర్ఎస్‌లో ఇంకా ఆ మూడు స్థానాలపై సస్పెన్స్ వీడలేదు. గోషామహల్, నాంపల్లి, అలంపూర్ అభ్యర్థులపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఆగస్టు 21న ప్రకటించిన బీఆర్ఎస్ జాబితాలో సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహంనే అభ్యర్థిగా సీఎం కేటీఆర్ ప్రకటించారు. ఆ తర్వాత అలంపూర్ అభ్యర్థిపై గులాబీ బాస్ మనసు మార్చుకున్నారు.

BRS: బీఆర్ఎస్‌లో ఇంకా ఆ మూడు స్థానాలపై వీడని సస్పెన్స్

హైదరాబాద్: బీఆర్ఎస్‌ (BRS)లో ఇంకా ఆ మూడు స్థానాలపై సస్పెన్స్ వీడలేదు. గోషామహల్ (Goshamahal), నాంపల్లి (Nampally), అలంపూర్ (Alampur) అభ్యర్థులపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఆగస్టు 21న ప్రకటించిన బీఆర్ఎస్ జాబితాలో సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం (Abraham)నే అభ్యర్థిగా సీఎం కేసీఆర్ (CM KCR) ప్రకటించారు. ఆ తర్వాత అలంపూర్ అభ్యర్థిపై గులాబీ బాస్ మనసు మార్చుకున్నారు. పార్టీ అధినేత అబ్రహంకు బిఫాం ఇవ్వకుండా పక్కన పెట్టేసారు. అబ్రహం స్థానంలో విజయుడు (Vijayudu) పేరును ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి (MLC Venkatram Reddy) ప్రతిపాదించారు. ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి ఒత్తిడితో సిట్టింగ్ ఎమ్మెల్యే టికెట్ కట్ చేయాలని నిర్ణయించుకున్నారు. అబ్రహం స్థానంలో స్థానిక నేత విజయుడికి టికెట్ ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. బీఫామ్ కోసం పార్టీ పెద్దలపై సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం ఒత్తిడి చేస్తున్నారు.

కాగా అబ్రహంను ప్రగతి భవన్ పెద్దలు బుజ్జగిస్తున్నారు. నేడో.. రేపో విజయుడికి బీఫామ్ అందించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మిగిలిన నాంపల్లి, గోషామహల్ అభ్యర్థులపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఆ రెండు నియోజకవర్గాలకు ఇప్పటివరకు ముఖ్యమంత్రి అభ్యర్థులను ప్రకటించలేదు. ఆ రెండు నియోజకవర్గాల్లో ఎంఐఎం (MIM)కు మేలు చేసేలా బీఆర్ఎస్ ఫ్రెండ్లీ పోటీ చేయనుంది. దానికి ప్రతిగా జూబ్లీహిల్స్ రాజేంద్రనగర్‌లో బీఆర్ఎస్‌కు లాభం జరిగేలా ఎంఐఎం పోటీ ఉంటుంది. ఇన్నాళ్లు ఎంఐఎం నిర్ణయం కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎదురు చూశారు. ఎంఐఎంతో ఫ్రెండ్లీ పోటీపై చర్చలు కొలిక్కి వచ్చాయి. గోషామహల్‌కు నంద కిషోర్ బిలాల్ (Nanda Kishore Bilal), నాంపల్లికి ఆనంద్ గౌడ్ (Anand Goud) పేర్లను కేసీఆర్ దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. ఈరోజో రేపో వారికి బి ఫామ్ లు అందించే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది.

Updated Date - 2023-11-07T14:03:10+05:30 IST