Share News

Hyderabad BJP: బీజేపీ అభ్యర్థి షాకింగ్ నిర్ణయం

ABN , First Publish Date - 2023-11-06T13:07:15+05:30 IST

చాంద్రాయణ గుట్ట బీజేపీ అభ్యర్థి ఉరడి సత్యనారాయణ ముదిరాజు ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు ఆయన పార్టీ అధిష్ఠానానికి

Hyderabad BJP: బీజేపీ అభ్యర్థి షాకింగ్ నిర్ణయం

అనారోగ్య కారణాలతో సత్యనారాయణ దూరం

హైదరాబాద్‌ సిటీ, నవంబర్‌ 5 (ఆంధ్రజ్యోతి): చాంద్రాయణ గుట్ట బీజేపీ అభ్యర్థి ఉరడి సత్యనారాయణ ముదిరాజు ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు ఆయన పార్టీ అధిష్ఠానానికి లేఖ రాశారు. అనారోగ్య కారణాల వల్ల తాను ప్రచారంలో పాల్గొన లేకపోతున్నానని, వైద్యుల సలహా మేరకు పోటీ నుంచి తప్పుకుంటున్నానని అగ్రనాయకులకు తెలిపారు. మొదటి జాబితాలోనే ఆయనకు టికెట్‌ దక్కింది. ప్రచారం కూడా మొదలు పెట్టారు. బస్తీల్లో పాదయాత్ర చేశారు. నాయకులు, కుల సంఘాలు, అభిమానులతో సమావేశాలు నిర్వహించారు. ప్రచారం సమయంలో ఆయనకు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. వైద్యుల సూచన మేరకు ఆయన పోటీ నుంచి విరమించుకున్నారు.

Updated Date - 2023-11-06T13:11:05+05:30 IST