TS News: న్యూఇయర్‌కు డ్రగ్స్ కొనుగోలు ప్లాన్ చేస్తున్న ముఠా అరెస్ట్.. వివరాలు చెప్పిన రాచకొండ సీపీ
ABN , Publish Date - Dec 18 , 2023 | 01:15 PM
Telangana: నూతన సంవత్సర వేడుకలకు డ్రగ్స్ కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తున్న ముఠాను రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకలకు డ్రగ్స్ కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తున్న ముఠాను రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు (SOT Police) అరెస్ట్ చేశారు. దీనిపై రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు (Rachakonda CP Sudheer babu) మాట్లాడుతూ.. ఈ ముఠా డ్రగ్స్‌ను రాజస్థాన్ నుంచి తీసుకుని వచ్చి హైదరాబాద్‌లో అమ్మాలని చూస్తున్నారన్నారు. ఓపియం డ్రగ్ 3.4 కేజీలు, 45 గ్రాముల పాపి స్ట్రాప్ పౌడర్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అలాగూ రూ.2.8 లక్షలు నగదు సీజ్ చేసినట్లు తెలిపారు. ఇద్దరు నిందితులను ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. శశిపాల్ బిష్ నాయ్, మదనలాల్ బిష్ బాయ్‌లను అరెస్ట్ చేసినట్లు రాచకొండ సీపీ వెల్లడించారు. శశిపాల్ గతంలో కూడా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడని.. బస్ ద్వారా డ్రగ్స్‌ను హైదరాబాద్‌కు తెస్తున్నారన్నారు. డ్రగ్స్‌ను నిర్మూలించడానికి స్పెషల్ డ్రైవ్‌లు ఏర్పాటు చేస్తున్నామని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు వెల్లడించారు.