Share News

KCR: కేసీఆర్‌ని పరామర్శించిన ప్రకాష్ రాజ్, బీఆర్ఎస్ కీలక నేతలు

ABN , First Publish Date - 2023-12-11T13:14:11+05:30 IST

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పరామర్శించేందుకు ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ యశోద ఆసుపత్రికి వెళ్లారు. ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి పరామర్శించారు.

KCR: కేసీఆర్‌ని పరామర్శించిన ప్రకాష్ రాజ్, బీఆర్ఎస్ కీలక నేతలు

హైదరాబాద్ : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పరామర్శించేందుకు ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ యశోద ఆసుపత్రికి వెళ్లారు. ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి పరామర్శించారు. కేసీఆర్ గారి ఆరోగ్యపరిస్థితి గురించి ఆరా తీశారు. కోలుకుంటున్న విషయం తెలుసుకున్నారు. అక్కడే ఉన్న ఎమ్మెల్సీ కవితను సైతం ప్రకాష్ రాజ్ పరామర్శించారు. మాజీ మంత్రులు గంగుల కమలాకర్, మల్లారెడ్డి, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ లు మధుసూదన చారి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి మోత్కుపల్లి, చల్మడ లక్ష్మి నరసింహారావు తదితరులు కూడా కేసీఆర్ ఆరోగ్యపరిస్థితి గురించి తెలుసుకొని కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Updated Date - 2023-12-11T13:14:12+05:30 IST