Kishan Reddy: తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధుల చిట్టా విప్పిన కేంద్రమంత్రి

ABN , First Publish Date - 2023-06-17T14:55:03+05:30 IST

తొమ్మిదేళ్లలో తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై బాగ్ లింగంపల్లిలో కిషన్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి బండి సంజయ్, లక్ష్మణ్, డీకే అరుణ, గరికపాటి మోహనరావు, వివేక్, మర్రి శశిధర్ రెడ్డి, పొంగులేటి ఇతర ప్రముఖలు హాజరయ్యారు. ప్రత్యేక ఆకర్షణగా సినీ రచయిత, రాజ్యసభ సభ్యుడు..

Kishan Reddy: తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధుల చిట్టా విప్పిన కేంద్రమంత్రి
Kishan Reddy

హైదరాబాద్: 2017లో జీఎస్టీ (GST) ప్రవేశపెట్టినప్పటి నుంచీ కేంద్రం తెలంగాణకు రూ. 8,379 కోట్లు ఇచ్చిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) తెలిపారు. తొమ్మిదేళ్లలో తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై బాగ్ లింగంపల్లిలో కిషన్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి బండి సంజయ్, లక్ష్మణ్, డీకే అరుణ, గరికపాటి మోహనరావు, వివేక్, మర్రి శశిధర్ రెడ్డి, పొంగులేటి ఇతర ప్రముఖలు హాజరయ్యారు. ప్రత్యేక ఆకర్షణగా సినీ రచయిత, రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్ నిలిచారు.

పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో కిషన్‌రెడ్డి ఏమన్నారంటే..

‘‘2020 నుంచి 2022 కరోనా కాలంలో కూడా ఇచ్చిన రూ.6,950 కోట్ల రుణాన్ని కూడా కేంద్రమే భరించింది. జీఎస్టీ (GST) పరిహారం కింద మొత్తం 15 వేల 329 కోట్ల రూపాయలు ఇచ్చింది. రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజలకు రూ. 9.26 లక్షల కోట్లు వ్యక్తి గత ఋణాలు కేంద్రం ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా తెలంగాణలో 5 లక్షల 27 వేల కోట్లు ఖర్చు చేసింది. తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు మీద కేంద్రం కేటాయించిన నిధులు రూ.1.35 లక్షల కోట్లు. పార్లమెంట్ నియోజకవర్గాల అభివృద్ధి నిధులు (ఎంపీ లాడ్స్) కింద రూ.983 కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి, సామాజిక మౌలిక సదుపాయాలు కల్పినకు కేంద్రం రూ. 2250 కోట్లు ఇచ్చింది. రాష్ట్రాల పన్నుల వాటా పంపిణీని 32 శాతం నుంచి 42 శాతానికి పెంచింది.’’ అని కిషన్‌రెడ్డి తెలిపారు.

బస్తీ దవాఖానాల కోసం..

‘‘బస్తీ దవాఖానాల కోసం తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులు రూ.902 కోట్లు. 2014 నుంచి పన్నుల వాటా రూపంలో తెలంగాణకు అందిన మొత్తం రూ.1.60 లక్షల కోట్లు. నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా కేంద్రం.. తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన నిధులు రూ.6,438 కోట్లు. కరోనా టైంలో అత్యవసర ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్యాకేజీ కింద తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులు రూ.685 కోట్లు. తెలంగాణలో 7.8 కోట్ల కరోనా డోస్‌లు ఉచితంగా కేంద్రం ఇచ్చింది. ఇందుకోసం తెలంగాణకు కేంద్రం ఖర్చు చేసిన నిధులు రూ.1800 కోట్లు.’’ అని కిషన్‌రెడ్డి వివరించి చెప్పారు.

Updated Date - 2023-06-17T14:55:03+05:30 IST