Online Offence: ఆన్‌లైన్ వ్యభిచారం గుట్టు రట్టు

ABN , First Publish Date - 2023-02-04T23:17:13+05:30 IST

నగరంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు ఈ తనిఖీల్లో ఆన్‌లైన్ వ్యభిచారాన్ని నిర్వహిస్తున్న ముఠాను చాకచక్యంగా పట్టుకుని వారి గుట్టు రట్టు చేశారు.

Online Offence: ఆన్‌లైన్ వ్యభిచారం గుట్టు రట్టు

హైదరాబాద్(Hyderabad): నగరంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు ఈ తనిఖీల్లో ఆన్‌లైన్ వ్యభిచారాన్ని నిర్వహిస్తున్న ముఠాను చాకచక్యంగా పట్టుకుని వారి గుట్టు రట్టు చేశారు. ఈ తనిఖీల్లో ప్రముఖ తెలుగు డైరెక్టర్ (telugu director) దగ్గర అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. 2017 నుంచి ఓ ప్రముఖ డైరెక్టర్ దగ్గర సురేష్ బోయిన (Suresh Boyina) అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. సురేష్ బోయినతో పాటు మేకల అఖిల్ కుమార్‌ (mekala Akhil Kumar)ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సినిమాల్లో అవకాశాలు (movie chances) ఇస్తామని సురేష్ అమ్మాయిలని డ్రాప్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

హైదరాబాద్‌లోని ప్రముఖులకు యువతులను బోయిన సురేష్ సరఫరా చేసినట్లు సమాచారం. గోవా బెంగళూరులో సైతం సురేష్ వ్యభిచారాన్ని నిర్వహించాడు. ముంబై, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి బోయిన సురేష్ వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. అమ్మాయిల ఫొటోలను ఆన్‌లైన్‌లో పెట్టి సురేష్ వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. మహిళలు, యువతుల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని వారిని వ్యభిచార కూపంలోకి లాగుతున్నారు. వీరి ఫొటోలను వాట్సాప్‌తో వాటు వివిధ మాధ్యమాల ద్వారా విటులకు పంపించి ఆకర్షించేవారు. ఎవరైనా ఆకర్షితులైతే వారి వద్ద ఆన్‌లైన్ ద్వారానే డబ్బులు తీసుకుని కోరిన చోటుకు అమ్మాయిలను పంపించి ఆన్‌లైన్ వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

Updated Date - 2023-02-04T23:35:05+05:30 IST