TS News: రోడ్డుపై పడిపోయిన ఆయిల్ డ్రమ్ములు.. జారిపడుతున్న వాహనదారులు... ఎక్కడంటే..

ABN , First Publish Date - 2023-06-07T11:51:07+05:30 IST

నగరంలోని మాసబ్‌ ట్యాంక్‌ వద్ద ఆయిల్ డ్రమ్ములతో వెళ్తున్న టస్కర్ వాహనంలోని నుంచి ఆయిల్ డ్రమ్ములు కిందపడిపోయింది. మెహదీపట్నం నుంచి మాసాబ్ ట్యాంక్ మీదుగా వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

TS News: రోడ్డుపై పడిపోయిన ఆయిల్ డ్రమ్ములు.. జారిపడుతున్న వాహనదారులు... ఎక్కడంటే..

హైదరాబాద్: నగరంలోని మాసబ్‌ ట్యాంక్‌ వద్ద ఆయిల్ డ్రమ్ములతో వెళ్తున్న టస్కర్ వాహనంలోని నుంచి ఆయిల్ డ్రమ్ములు కిందపడిపోయింది. మెహదీపట్నం నుంచి మాసాబ్ ట్యాంక్ మీదుగా వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ ఎక్కుతున్న సమయంలో ఆయిల్ డ్రమ్ములు కిందపడిపోయాయి. దీంతో రోడ్డు మొత్తం ఆయిల్ విస్తరించింది. దీన్ని గమనించిన వాహనదారులు ఆ మార్గంలో వస్తూ స్కిడ్ అయి కిందపడిపోతున్న పరిస్థితి. పలువురు వాహనదారులు స్వల్పంగా గాయపడ్డారు. మొత్తం నాలుగు డ్రమ్ములు రోడ్డుపై పడిపోగా..ఒక్కో డ్రమ్ 800 లీటర్ల సామర్థ్యం ఉంది. ఈ ఘటనతో ఆమార్గంలో భారీగా ట్రాఫిక్ జాం అయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందిన వెంటనే ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. జీహెచ్ఎంసీ సిబ్బంది రోడ్డుపై సుమారు 50 ట్రిప్పుల మట్టి పోశారు. రోడ్డుపై మట్టి పోసిన అనంతరం వాహన రాకపోకలను ట్రాఫిక్ పోలీసులు పునరుద్ధరించారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు సుమారు నాలుగు గంటల పాటు ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది. రోడ్డుపై పోసిన మట్టిని సాయంత్రం క్లియర్ చేస్తామని జీహెచ్‌ఎంసీ సిబ్బంది చెబుతున్నారు.

Updated Date - 2023-06-07T11:51:07+05:30 IST