TS News: హైదరాబాద్‌లో ఇద్దరు మైనర్ అమ్మాయిల అదృశ్యం

ABN , First Publish Date - 2023-09-26T10:13:31+05:30 IST

నగరంలోని జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఇద్దరు మైనర్ అమ్మాయిల అదృశ్యం కలకలం రేపుతోంది.

TS News: హైదరాబాద్‌లో ఇద్దరు మైనర్ అమ్మాయిల అదృశ్యం

హైదరాబాద్: నగరంలోని జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఇద్దరు మైనర్ అమ్మాయిల అదృశ్యం కలకలం రేపుతోంది. తల్లిదండ్రులు మందలించారని ఇంట్లో నుంచి డబ్బులు తీసుకొని అమ్మాయిలు వెళ్లిపోయారు. అదృశ్యమైన అమ్మాయిలు పి.దీక్షిత (13) 9వ తరగతి, యం.విజయ 10 వతరగతి (14)గా గుర్తించారు. ఇద్దరు ద్వారకనగర్ చింతల్‌కు చెందిన వారు. అమ్మాయిలు కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకొన్న పోలీసులు అమ్మాయిల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Updated Date - 2023-09-26T10:13:31+05:30 IST