Hyderabad Rain Alert: హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన
ABN , First Publish Date - 2023-03-18T13:29:29+05:30 IST
హైదరాబాద్ (Rain in Hyderabad)లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈరోజు సాయంత్రం నుంచి హైదరాబాద్‌తో సహా

హైదరాబాద్: హైదరాబాద్ (Rain in Hyderabad)లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈరోజు సాయంత్రం నుంచి హైదరాబాద్‌తో సహా తెలంగాణ రాష్ట్ర (Telangana) వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇప్పటికే రెండ్రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో హడలెత్తిస్తోంది. అలాగే కొన్ని చోట్ల వడగండ్ల వర్షం కురవడంతో చేతికొచ్చిన పంటలు కూడా దెబ్బతిన్నాయి. దీంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.