Share News

Manda Krishna Madiga: ఎస్సీ వర్గీకరణపై రాజకీయ పార్టీల వైఖరీని వెల్లడించాలి

ABN , First Publish Date - 2023-10-21T17:08:41+05:30 IST

ఎస్సీ వర్గీకరణపై రాజకీయ పార్టీల వైఖరి వెల్లడించాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ( Manda Krishna Madiga ) అన్నారు. శనివారం నాడు మంచిర్యాల జిల్లాలో పర్యటించారు.

Manda Krishna Madiga: ఎస్సీ వర్గీకరణపై  రాజకీయ పార్టీల వైఖరీని వెల్లడించాలి

మంచిర్యాల : ఎస్సీ వర్గీకరణపై రాజకీయ పార్టీల వైఖరి వెల్లడించాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ( Manda Krishna Madiga ) అన్నారు. శనివారం నాడు మంచిర్యాల జిల్లాలో పర్యటించారు. ఈసందర్భంగా మందక‌ృష్ణ మాదిగ మాట్లాడుతూ...‘‘అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు 19 ఎస్సీ రిజర్వు స్థానాల్లో 14 సీట్లకు తగ్గకుండా మాదిగలకు కేటాయించాలి. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వర్గీకరణ బిల్లు పెట్టాలి.. అన్ని పార్టీలు ఈ బిల్లుకి మద్దతు తెలపాలి. సమస్య పరిష్కారానికి చొరవ తీసుకునే పార్టీకే మాదిగల మద్దతు ఉంటుంది. కేసీఆర్ మాదిగలకు అన్యాయం చేస్తున్నారు. నల్లాల ఓదెలు, డాక్టర్ రాజయ్యలే ఇందుకు ఉదాహరణ. మంత్రి వర్గంలోనూ మాదిగలకు స్థానం లేకుండా చేశారు. మంచిర్యాల జిల్లా పరిధిలో రెండు సీట్లు మాదిగలకు ఇవ్వాలి. చెన్నూరులో మాదిగలకు టికెట్ ఇవ్వని పార్టీకి తగిన బుద్ధి చెప్తాం. మాకు ఆన్యాయం చేసిన పార్టీలను మాదిగ పల్లెల్లోకి రాకుండ చేస్తాం’’ అని మంద కృష్ణ మాదిగ పేర్కొన్నారు.

Updated Date - 2023-10-21T17:08:41+05:30 IST