Gutta: గవర్నర్‌పై పరోక్ష వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-01-26T10:40:14+05:30 IST

గవర్నర్‌ తమిళిసై (Tamilisai Soundararajan)పై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి (Gutta Sukhender Reddy) పరోక్ష వ్యాఖ్యలు చేశారు. శాసనమండలిలో జెండా ఆవిష్కరణ అనంతరం ఆయన మాట్లాడారు. ‘‘బాధ్యతల్లో ఉన్న

Gutta: గవర్నర్‌పై పరోక్ష వ్యాఖ్యలు
తెలంగాణలో అందరూ సంతోషంగా ఉన్నారు

హైదరాబాద్: గవర్నర్‌ తమిళిసై (Tamilisai Soundararajan)పై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి (Gutta Sukhender Reddy) పరోక్ష వ్యాఖ్యలు చేశారు. శాసనమండలిలో జెండా ఆవిష్కరణ అనంతరం ఆయన మాట్లాడారు. ‘‘బాధ్యతల్లో ఉన్న వాళ్లు తెలంగాణ (Telangana)అభివృద్ధిని గమనించకపోవడం బాధాకరం, రాష్ట్ర ప్రభుత్వాన్ని (BRS government) విమర్శించే వారు.. కేంద్రం ఏం చేసిందో కూడా చెప్పాల్సి ఉంటుంది. కేంద్రం ఏం చేసిందని అడిగితే.. జాతీయ రహదారుల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. తెలంగాణలో అందరూ సంతోషంగా ఉన్నారు. తెలంగాణ అభివృద్ధి కొందరికి కనపడకపోతే ఏం చేసేది లేదు. వ్యవసాయ క్షేత్రాలను, కొత్త భవనాలను విమర్శించడం తగదు.’’ అని గుత్తా హితవు పలికారు.

Updated Date - 2023-01-26T10:40:15+05:30 IST