TS Election: బీఆర్ఎస్‌లోకి జిట్టా బాలకృష్ణారెడ్డి?
ABN , First Publish Date - 2023-10-19T14:35:48+05:30 IST
తెలంగాణ ఎన్నికల ముందు ప్రధాన పార్టీల్లోకి వలసలు జోరందుకుంటున్నాయి. అసంతృప్తులు ఒక పార్టీలోంచి.. మరొక పార్టీలోకి వెళ్లిపోతున్నారు. ఎప్పుడు ఎవరు ఏ గట్టున
హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల ముందు ప్రధాన పార్టీల్లోకి వలసలు జోరందుకుంటున్నాయి. అసంతృప్తులు ఒక పార్టీలోంచి.. మరొక పార్టీలోకి వెళ్లిపోతున్నారు. ఎప్పుడు ఎవరు ఏ గట్టున ఉంటున్నారో అర్థం కావట్లేదు. ఇటీవలే బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన జిట్టా బాలకృష్ణారెడ్డి.. మళ్లీ సొంత గూటికి వెళ్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లో టికెట్ దక్కకపోవడంతో ఆయన నిరాశ చెందినట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్‌ను వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అగ్ర నేతలు జిట్టా బాలకృష్ణారెడ్డితో టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ చర్చలు జరిపినట్లు సమాచారం. భువనగిరిలో జరిగే ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో జిట్టా బీఆర్ఎస్‌లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
జిట్టా బాలకృష్ణారెడ్డి 2009 వరకూ బీఆర్ఎస్‌లో కీలకమైన నేతగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ కీలక రోల్ పోషించారు. 2009లో భువనగిరి టికెట్ దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురై పార్టీకి దూరమయ్యారు.