Hyderabad Traffic Alert: హైదరాబాద్ ట్రాఫిక్ అలర్ట్.. ముఖ్యంగా ఈ రూట్లో ఆఫీస్‌ల నుంచి ఇంటికి వెళుతున్న వాళ్లు తెలుసుకోండి..!

ABN , First Publish Date - 2023-06-02T19:28:30+05:30 IST

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం సెక్రటేరియట్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలుంటాయని అడిషనల్‌ సీపీ ట్రాఫిక్‌ జి. సుధీర్‌ బాబు ఓ ప్రకటనలో తెలిపారు.

Hyderabad Traffic Alert: హైదరాబాద్ ట్రాఫిక్ అలర్ట్.. ముఖ్యంగా ఈ రూట్లో ఆఫీస్‌ల నుంచి ఇంటికి వెళుతున్న వాళ్లు తెలుసుకోండి..!

హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి): సెక్రటేరియట్‌ పరిసరాల్లో శుక్రవారం (జూన్ 2, 2023) నాడు ట్రాఫిక్‌ ఆంక్షలుంటాయని అడిషనల్‌ సీపీ ట్రాఫిక్‌ జి. సుధీర్‌ బాబు ఓ ప్రకటనలో తెలిపారు. వీవీ స్ట్యాచ్యూ (ఖైరతాబాద్‌ జంక్షన్‌), ఓల్డ్‌ సైఫాబాద్‌ జంక్షన్‌, రవీంద్రభారతి జంక్షన్‌, మింట్‌ కాంపౌండ్‌ రోడ్‌, తెలుగుతల్లి జంక్షన్‌, నెక్లెస్‌ రోటరీ, నల్లగుట్ట జంక్షన్‌, కట్టమైసమ్మ టెంపుల్‌, ట్యాంక్‌ బండ్‌, లిబర్టీ జంక్షన్‌ల వద్ద రద్దీ ఎక్కువగా ఉండటంతో ఈ ప్రాంతాల ద్వారా ప్రయాణం చేయొద్దని సూచించారు. వీవీ స్టాచ్యూ నెక్లెస్‌ రోటరీ వైపు వాహనాలను అనుమతించరు. నిరంకారీ భవన్‌ వైపుకు పంపుతారు.

* ఇక్బాల్‌ మినార్‌ జంక్షన్‌ నుంచి లిబర్టీ వైపుకు వాహనాలను అనుమతించరు.

* ట్యాంక్‌ బండ్‌, తెలుగు తల్లి ప్లై ఓవర్లపై నుంచి వస్తున్న వాహనాలను ఎన్టీఆర్‌ మార్గ్‌ వైపునకు అనుమతించరు.

* బీఆర్‌కేఆర్‌ భవన్‌ వైపు నుంచి వచ్చే వాహనాలను సైతం ఇక్బాల్‌ మినార్‌ జంక్షన్‌ వైపునకు పంపుతారు.

* బడా గణేష్‌ వైపు నుంచి మింట్‌ కాంపౌండ్‌ వైపునకు వచ్చే వాహనాలను తెలుగు తల్లి ప్లై ఓవర్‌ వైపునకు పంపుతారు.

* ఎన్టీఆర్‌ గార్డెన్‌, ఎన్టీఆర్‌ ఘాట్‌, నెక్లెస్‌ రోడ్‌, లుంబినీ పార్క్‌ మొత్తం మూసివేస్తారు.

* రాజ్‌ భవన్‌ వైపునకు వెళ్లే ఆర్టీసీ బస్సులను అనుమతించరు. అఫ్జల్‌ గంజ్‌ నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే సిటీ బస్సులను దారి మళ్లిస్తారు.

Updated Date - 2023-06-02T19:34:00+05:30 IST