Vyuham Movie: వ్యూహం సినిమాపై విచారణ.. హైకోర్టులో ఏం జరిగిందంటే..
ABN , Publish Date - Dec 26 , 2023 | 12:47 PM
రాంగోపాల్ వర్మ వ్యూహం సినిమాపై నారా లోకేష్ దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నెల 29న వ్యూహం సినిమా విడుదల కావాల్సి ఉంది. వ్యూహం సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. వ్యూహం సినిమాకి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం పిటిషన్ దాఖలు చేయడం జరిగింది.
హైదరాబాద్: రాంగోపాల్ వర్మ వ్యూహం సినిమాపై నారా లోకేష్ దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నెల 29న వ్యూహం సినిమా విడుదల కావాల్సి ఉంది. వ్యూహం సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. వ్యూహం సినిమాకి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. నేడు హై కోర్టులో విచారణ జరిగింది. వ్యూహం సినిమాపై హై కోర్టులో విచారణ ప్రారంభమైంది. టీడీపీ తరపున మురళీధర్ రావు వాదనలు వినిపించారు. వ్యూహం సినిమా కేవలం పొలిటికల్ అజెండాతో రూపొందించారు. టీడీపీ, జనసేన, కాంగ్రెస్ నాయకులను డీ ఫేం చేసేలా సినిమా తీశారు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు అనుకూలంగా చిత్రాన్ని రూపొందించారని.. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్‌ను రద్దు చెయ్యాలి కోరుతున్నానని మురళీధర రావు పేర్కొన్నారు. ఏపీలో త్వరలో జరగబోయే ఎన్నికల మీద తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. ఫ్రీడం ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ పేరుతో డీ ఫేమ్‌కు పాల్పడటం సరికాదని.. దానికి కూడా ఒక హద్దు ఉంటుందన్నారు. వ్యూహం సినిమా కు ప్రొడ్యూసర్‌గా ఉన్నది రామదూత క్రియేషన్స్ అని.. ప్రొడ్యూసర్ అడ్రస్ కూడా వైసీపీకి చెందిన కార్యాలయం పేరిటే ఉందని మురళీధర రావు కోర్టుకు వివరించారు. బహిరంగగానే చంద్రబాబు, పవన్ తనకు ఇష్టం లేదని ఈ సినిమా ప్రీ రిలీజ్‌లో ఆర్జీవీ చెప్పారు. వ్యూహం సినిమా మొత్తం చంద్రబాబును కించపరచడానికే తీశారన్నారు. ఈ సినిమా ఫంక్షన్‌లకు సైతం వైసీపీ మంత్రులు హాజరయ్యారన్నారు. సినిమా ట్రైలర్, పాటలను పెన్ డ్రైవ్‌లో కోర్టుకు టీడీపీ తరుపు న్యాయవాది సమర్పించారు.