TS News : ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలకు భారీగా వరద

ABN , First Publish Date - 2023-07-28T10:14:17+05:30 IST

హైదరాబాద్‌లోని జంట జలాశయాలకు భారీగా వరద వచ్చి చేరుకుంటోంది. ఉస్మాన్ సాగర్ ఇన్ ఫ్లో 1600 క్యూసెక్కులకు చేరుకుంటోంది. ఉస్మాన్ సాగర్ ప్రస్తుత  నీటి  మట్టం 1787.95 అడుగులకు చేరుకుంది.

TS News : ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలకు భారీగా వరద

హైదరాబాద్ : హైదరాబాద్‌లోని జంట జలాశయాలకు భారీగా వరద వచ్చి చేరుకుంటోంది. ఉస్మాన్ సాగర్ ఇన్ ఫ్లో 1600 క్యూసెక్కులకు చేరుకుంటోంది. ఉస్మాన్ సాగర్ ప్రస్తుత  నీటి  మట్టం 1787.95 అడుగులకు చేరుకుంది. ఉస్మాన్  సాగర్ పూర్తిస్థాయి నీటి  మట్టం 1790 అడుగులకు చేరుకుంది. ఉస్మాన్ సాగర్ 4 గేట్లు  ఒక్క అడుగు మేర ఎత్తి 852 క్యూసెక్కుల నీటిని అధికారులు మూసిలోకి వదిలారు. హిమాయత్ సాగర్‌‌కు 3000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుకుంటోంది. హిమాయత్ సాగర్  ప్రస్తుత  నీటిమట్టం 1762.20 అడుగులకు చేరుకుంది. హిమాయత్  సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1763.50 అడుగులకు చేరుకుంది. హిమాయత్ సాగర్ రెండు గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి 2750 క్యూసెక్కుల నీటిని అధికారులు మూసిలోకి విడుదల చేశారు.

Updated Date - 2023-07-28T10:14:17+05:30 IST