Share News

Tamilisai: తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళిసై దీపావళి శుభాకాంక్షలు

ABN , First Publish Date - 2023-11-11T15:24:07+05:30 IST

Deepavali Festival: తెలంగాణ ప్రజలకు గవర్నర్‌ తమిళిసై దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

Tamilisai: తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళిసై దీపావళి శుభాకాంక్షలు

హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు గవర్నర్‌ తమిళిసై (Governor Tamilisai ) దీపావళి పండుగ (Deepavali Festival) శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ దీపాల పండుగ చెడుపై ధర్మం సాధించిన విజయాన్ని సూచిస్తుందన్నారు. ఆధునిక కాలపు దురాచారాలను జయించి, శాంతి, సామరస్యం, మత సామరస్యంతో కూడిన సమాజాన్ని నిర్మించడానికి మనకు స్ఫూర్తినిస్తాయని తాను ఖచ్చితంగా అనుకుంటున్నానని తెలిపారు. ఆత్మ నిర్భర్ భారత్ యొక్క నిజమైన స్ఫూర్తితో స్వదేశీ తయారీదారుల జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకురాలని చెప్పారు. ఈ పండుగకు స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయాలని అందరికీ గవర్నర్ విజ్ఞప్తి చేశారు. ఈ దీపావళి మన చుట్టూ ఉన్న ప్రజల జీవితాల్లో వెలుగులు, సంతోషం, శ్రేయస్సు, కొత్త ఆలోచనలను తేవాలని గవర్నర్ తమిళిసై కోరుకున్నారు.

Updated Date - 2023-11-11T15:24:08+05:30 IST