Share News

Governor Tamilisai: పదేళ్ల నిర్బంధ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి

ABN , Publish Date - Dec 15 , 2023 | 12:26 PM

Telangana: పదేళ్ల నిర్బంధ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగిందని గవర్నర్ తమిళిసై అన్నారు. శుక్రవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగించారు. ప్రజాకవి కాళోజీ కవితతో గవర్నర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. మార్పు ఫలాలు ప్రజలకు చేరుతున్నాయన్నారు.

Governor Tamilisai: పదేళ్ల నిర్బంధ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి

హైదరాబాద్: పదేళ్ల నిర్బంధ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగిందని గవర్నర్ తమిళిసై అన్నారు. శుక్రవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగించారు. ప్రజాకవి కాళోజీ కవితతో గవర్నర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. మార్పు ఫలాలు ప్రజలకు చేరుతున్నాయన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను తొందర్లోనే అమలు చేస్తామని ప్రభుత్వం పేర్కొందన్నారు. గత ప్రభుత్వ నిర్వాహకంతో విద్యుత్ సంస్థలు రూ.81,516 కోట్లు అప్పుల్లో ఉందన్నారు. 50 వేల 275 కోట్ల నష్టంలో విద్యుత్ సంస్థ కొనసాగుతుందని... పౌర సరఫరాల శాఖ 56 వేల కోట్లు అప్పుల్లో ఉందన్నారు. దాడి తప్పిన ఆర్థిక వ్యవస్థపై తమ ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. త్వరలో శాఖల వారీగా శ్వేత పత్రం విడుదల చేయనున్నట్లు చెప్పారు. గడిచిన తొమ్మిదిన్నర ఏళ్ళల్లో చాలా సంస్థలు విధ్వంసానికి గురయ్యాయన్నారు.


ప్రభుత్వ వ్యవస్థలు వ్యక్తుల కోసం పనిచేసాయని తెలిపారు. కార్య నిర్వాహక వ్యవస్థలో విలువలను పునరుద్ధరిస్తామని చెప్పారు. ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా తమ ప్రభుత్వం సమాన దృష్టితో చూస్తుందన్నారు. అనిచివేతకు, వివక్షకు గురైన ప్రతి వర్గానికి తమ ప్రభుత్వంలో స్థానం ఉంటుందన్నారు. గ్రామీణ అభివృద్ధిలో గత ప్రభుత్వం ప్రచారానికే పరిమితం అయ్యిందన్నారు. ప్రతి గ్రామ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రైతుల సంక్షేమ కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ధరణి పోర్టల్ స్థానంలో భూమాత పేరుతో పోర్టల్ తెస్తామని హామీ ఇచ్చామని.. కార్యచరణ రూపొందిస్తామన్నారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన అనంతరం అసెంబ్లీ రేపటి (శనివారం) వాయిదా పడింది.

Updated Date - Dec 15 , 2023 | 01:17 PM