Howrah-Secunderabad Falaknuma Express : ఫలక్‌నుమా రైలులో ప్రమాదం.. రెండు బోగీలు పూర్తిగా దగ్ధం

ABN , First Publish Date - 2023-07-07T12:14:15+05:30 IST

హౌరా నుంచి సికింద్రాబాద్ వెళుతున్న ఫలక్‌నుమా రైలులో పెను ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా రైలులో మంటలు అలముకున్నాయి. ప్రయాణికులంతా అప్రమత్తమై వెంటనే దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పగిడిపల్లి - బొమ్మాయిపల్లి మధ్యలో రైలు సికింద్రాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Howrah-Secunderabad Falaknuma Express : ఫలక్‌నుమా రైలులో ప్రమాదం.. రెండు బోగీలు పూర్తిగా దగ్ధం

యాదాద్రి : బాలాసోర్ ఘటనను మరువక ముందే హౌరా నుంచి సికింద్రాబాద్ వెళుతున్న ఫలక్‌నుమా రైలు (Train No - 12703)లో పెను ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా రైలులో మంటలు అలముకున్నాయి. ప్రయాణికులంతా అప్రమత్తమై వెంటనే దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పగిడిపల్లి - బొమ్మాయిపల్లి మధ్యలో రైలు సికింద్రాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అధికారులు అప్రమత్తమై వెంటనే రైలును నిలిపివేశారు. దీంతో ప్రయాణికులంతా హుటాహుటిన రైలు దిగి వెళ్లిపోయారు. క్షణాల్లోనే రైలు నుంచి దట్టమైన పొగలు ఆ ప్రాంతాన్ని కప్పేశాయి. మంటల్లో రెండు బోగీలు పూర్తిగా తగులబడిపోయాయి. సమాచారం అందుకున్న రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ హుటాహుటిన సంఘటన స్థలికి బయల్దేరారు.

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జూన్ 2న జరిగిన రైలు ప్రమాదం దేశ ప్రజలను ఎంతలా దిగ్భ్రాంతికి గురి చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆగి ఉన్న గూడ్సు రైలును కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొన్న ప్రమాదంలో 288మంది ప్రాణాలు కోల్పోగా.. వందలాది మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఇప్పటికీ చాలా మంది ప్రయాణికులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.బాలాసోర్‌లోని బహనాగా వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దాదాపు 300 మంది మృతిచెందగా, 11వందల మంది క్షతగాత్రులయ్యారు.

Updated Date - 2023-07-07T12:21:41+05:30 IST