TS News: బేకరీలో పేలిన సిలిండర్.. పలువురికి తీవ్ర గాయాలు
ABN , Publish Date - Dec 14 , 2023 | 01:57 PM
Telangana: రాజేంద్రనగర్‌లోని కరాచీ బేకరీలో సిలిండర్ పేలింది. కరాచీ బేకరీ క్యాంటీన్లో ఒక్కసారిగా ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో అక్కడే ఉన్న కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి.
హైదరాబాద్: రాజేంద్రనగర్‌లోని కరాచీ బేకరీలో సిలిండర్ పేలింది. కరాచీ బేకరీ క్యాంటీన్లో ఒక్కసారిగా ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో అక్కడే ఉన్న కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. దాదాపు 15 మందికి గాయాలవగా.. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. తీవ్రంగా గాయపడిన కార్మికులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.