Ts News: పర్వతాపూర్‌లో ఆర్యవైశ్య సంఘం ఆవిర్భావం

ABN , First Publish Date - 2023-01-08T15:42:39+05:30 IST

నగరంలోని పీర్జాదిగూడ (Hyderabad Pirjadiguda) కార్పొరేషన్ పరిధిలో ఉన్న పర్వతాపూర్‌లో నూతనంగా ఆర్యవైశ్య సంఘం (Arya Vysya Sangam) ఏర్పాటైంది. ఆదివారం ఉదయం

Ts News: పర్వతాపూర్‌లో ఆర్యవైశ్య సంఘం ఆవిర్భావం
ఆవిర్భావం

హైదరాబాద్: నగరంలోని పీర్జాదిగూడ (Hyderabad Pirjadiguda) కార్పొరేషన్ పరిధిలో ఉన్న పర్వతాపూర్‌లో నూతనంగా ఆర్యవైశ్య సంఘం (Arya Vysya Sangam) ఏర్పాటైంది. ఆదివారం ఉదయం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవం పర్వతాపూర్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా పాల్గొని‌ కార్యవర్గ సభ్యులతో ప్రమాణం చేయించారు. సంఘం అధ్యక్షుడు మానేపల్లి లక్ష్మీ నారాయణ, ఉపాధ్యక్షుడు బోనగిరి చిరంజీవులు, ప్రధాన కార్యదర్శి పుట్టా హరికృష్ణ, కోశాధికారి ఇమ్మడి సందీప్ కుమార్, సంయుక్త కార్యదర్శి ముప్పిరిశెట్టి బాలాజీ, కార్యనిర్వాహక సభ్యులు అమర్‌నాథ్, శివకుమార్‌లు ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ సమాజ అభ్యున్నతికి, పేదల సంక్షేమానికి అందరూ కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర క్యాలెండర్‌ (New Year Calendar)ను ఆవిష్కరించారు.‌

c-2.gif

Updated Date - 2023-01-08T15:42:41+05:30 IST