Share News

Corona Update: తెలంగాణ వ్యాప్తంగా 19 కరోనా కేసులు.. ఎక్కడెక్కడంటే..

ABN , Publish Date - Dec 22 , 2023 | 09:37 AM

హైదరాబాద్: చిన్న పిల్లల్లో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. కొత్త వేరియంట్‌తో పిల్లలను అప్రమత్తంగా ఉంచాలని కేంద్రప్రభుత్వం సూచించింది. హైదరాబాద్‌లో పిల్లల్లో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.

Corona Update: తెలంగాణ వ్యాప్తంగా 19 కరోనా కేసులు.. ఎక్కడెక్కడంటే..

హైదరాబాద్: చిన్న పిల్లల్లో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. కొత్త వేరియంట్‌తో పిల్లలను అప్రమత్తంగా ఉంచాలని కేంద్రప్రభుత్వం సూచించింది. హైదరాబాద్‌లో పిల్లల్లో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. నిలోఫర్ ఆస్పత్రిలో ఇద్దరు చిన్నారులకు కోవిడ్ నిర్ధారణ అయింది. కాగా ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా 19 అక్టీవ్ కేసులు నమోదయ్యాయి.

తెలంగాణ వ్యాప్తంగా క్రమంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 925 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 6 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య 19కి చేరింది. కరోనా బారి నుంచి ఒకరు కోలుకున్నట్లు వైద్యారోగ్యశాఖ పేర్కొంది. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా లక్షణాలు ఏవైనా ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నారు.

Updated Date - Dec 22 , 2023 | 12:19 PM