Hyderabad: కేసీఆర్ తీరుపై కాంగ్రెస్, ఎన్సీపీ నేతల ఆగ్రహం
ABN , First Publish Date - 2023-06-26T12:33:41+05:30 IST
మహారాష్ట్ర: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ టార్గెట్‌గా చేరికలపై కేసీఆర్ ఫోకస్ పెట్టారు. బీజేపీకి కేసీఆర్ బీటీమ్‌గా పనిచేస్తున్నారని ఎన్సీపీ నేత శరత్ పవర్ మండిపడ్డారు.
మహారాష్ట్ర: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) తీరుపై కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు (NCP Leaders) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ (Congress), ఎన్సీపీ టార్గెట్‌గా చేరికలపై కేసీఆర్ ఫోకస్ పెట్టారు. బీజేపీ (BJP)కి కేసీఆర్ బీటీమ్‌గా పనిచేస్తున్నారని ఎన్సీపీ నేత శరత్ పవర్ (Sarath Power) మండిపడ్డారు. మహారాష్ట్ర (Maharashtra)లో కేసీఆర్ బీజేపీ కోసం పని చేస్తున్నారని విమర్శించారు. అటు మహారాష్ట్ర ప్రజలు కేసీఆర్‌ను నమ్మడం లేదని, మహారాష్ట్రలో బీఆర్ఎస్ ఒక్క స్థానంలో గెలిచిన రాజకీయాల నుండి తప్పుకుంటానని కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రే (Manik Rao Thackeray) సవాల్ చేశారు. కాంగ్రెస్, ఎన్సీపీ విమర్శలతో మహారాష్ట్రలో భారీ ప్రదర్శనకు కేసీఆర్ ప్లాన్ చేశారు. సోమవారం ఉదయం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్‌లతో కలిసి రోడ్డు మార్గాన సుమారు 200 వాహనాల్లో మహారాష్ట్రకు బయలుదేరారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర (Maharashtra)లో ఈరోజు, రేపు (సోమ, మంగళ) రెండు రోజులు పర్యటించనున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం ప్రగతిభవన్ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలతో భారీ కాన్వాయ్‌లతో సీఎం కేసీఆర్ రోడ్డు మార్గాన బయలుదేరారు. ముందుగా విఠలేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. తర్వాత సోలాపూర్ (Solapur)లో జరిగే పార్టీ కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొంటారు. ఈ సందర్బంగా సోలాపూర్ నేత భగీరథ బాల్కే సహా పలువురు మహారాష్ట్ర నేతలు బీఆర్‌ఎస్ (BRS)లో చేరనున్నారు. తర్వాత దారాశివ్ జిల్లాలోని శక్తిపీఠమైన తుల్జాభవానీ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారు. పండరిపూర్ విటోభ రుక్మిణీ మందిర్‌లో సీఎం కేసీఆర్ పూజలు చేస్తారు.