Bakka judson: రహస్యంగా నిధులు మళ్లించారని బీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌పై ఈడీకి ఫిర్యాదు

ABN , First Publish Date - 2023-01-02T13:17:31+05:30 IST

బీఆర్ఎస్(BRS) ఎంపీ జోగినపల్లి సంతోష్‌ (Joginapally Santosh Kumar)పై ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల (ED)కు కాంగ్రెస్ నేత బక్క జడ్సన్(Bakka judson) ఫిర్యాదు చేశారు. హరితహారం

Bakka judson: రహస్యంగా నిధులు మళ్లించారని బీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌పై ఈడీకి ఫిర్యాదు
ఈడీకి ఫిర్యాదు

ఢిల్లీ: బీఆర్ఎస్ (BRS) ఎంపీ జోగినపల్లి సంతోష్‌ (Joginapally Santosh Kumar)పై ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల (ED)కు కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ (Bakka judson) ఫిర్యాదు చేశారు. హరితహారం (Haritha Haram) కార్యక్రమం పేరుతో కేసీఆర్ ప్రభుత్వం పెద్ద కుంభకోణానికి పాల్పడిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. హరితహారం ముసుగులో ప్రభుత్వ సొమ్మును స్వాహా చేసే ఈ గేమ్‌లో సూత్రధారి జోగినపల్లి సంతోషేనని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నరేగాకు ఇచ్చిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం రహస్యంగా హరితహారం కార్యక్రమానికి దారి మళ్లించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే కాంపా నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం దుర్వినయోగం చేసిందని బక్క జడ్సన్ తన ఫిర్యాదులో పొందిపరిచారు.

Updated Date - 2023-01-02T13:17:32+05:30 IST