Fly Over : ఎల్బీ నగర్‌లో కుప్పకూలిన ఫ్లై ఓవర్ స్లాబ్.. పలువురికి గాయాలు
ABN , First Publish Date - 2023-06-21T08:41:03+05:30 IST
ఎల్బీ నగర్ సాగర్ రింగ్ రోడ్డులో ఎల్బీ నగర్ సాగర్ రింగ్ రోడ్ నుంచి ఎల్బీ నగర్ చౌరస్తా వరకూ నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ వద్ద పిల్లర్.. పిల్లర్‌కు మధ్య ఉన్న స్లాబ్ కుప్పకూలింది. ప్రమాద సమయంలో స్లాబ్ పై పది మంది కార్మికులు పనులు చేస్తున్నారు. వారిలో ఇరువురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న హాస్పిటల్ కి తరలించారు.
హైదరాబాద్ : హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్ సాగర్ రింగ్ రోడ్డులో ఎల్బీ నగర్ సాగర్ రింగ్ రోడ్ నుంచి ఎల్బీ నగర్ చౌరస్తా వరకూ నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ వద్ద పిల్లర్.. పిల్లర్‌కు మధ్య ఉన్న స్లాబ్ కుప్పకూలింది. ప్రమాద సమయంలో స్లాబ్ పై పది మంది కార్మికులు పనులు చేస్తున్నారు. వారిలో ఇరువురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న హాస్పిటల్ కి తరలించారు. కార్మికులు బీహార్, యూపీకి చెందిన వారిగా గుర్తించారు. ఘటన స్థలాన్ని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పరిశీలించారు.
సాగర్ రింగ్ రోడ్‌లో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ ర్యాంప్ కూలిన విషయంలో ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ పంకజం మాట్లాడుతూ.. రాత్రి మూడు గంటల సమయంలో ర్యాంప్ కూలడం జరిగిందని చెప్పారు. అందులో పని చేసే పదిమందికి గాయాలయ్యాయన్నారు. వారిలో ఇద్దరికీ సీరియస్ గా ఉందని వెంటనే వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించామని తెలిపారు. ప్రమాదం జరిగిన అంశంపై ఎంక్వయిరీ చేస్తున్నామని చెప్పారు.
ఫ్లైఓవర్ ప్రమాద ఘటనలో గాయపడిన వారి పేర్లు...
1) జితేందర్ కుమార్
2)రవికుమార్
3)గోపాల్ కృష్ణ
4)పునీతకుమార్
5)రోహిత్
6)శంకర్ లాల్
7)హరేరాంకుమార్
8)భీక్లీ
వీరిలో గోపాలకృష్ణ మాత్రం రంగారెడ్డి జిల్లాకు చెందిన వారు. ఆయన ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. మిగిలిన వారంతా యూపీ, బీహార్‌కు చెందిన వారు.