Swapnalok Complex: BM5 సెంటర్ పేరుతో కాల్ సెంటర్..తెర వెనుక క్యూనెట్ ఎంఎల్ఎం దందా

ABN , First Publish Date - 2023-03-18T11:52:07+05:30 IST

స్వప్నలోక్ కాంప్లెక్స్ ఘటనపై పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతులంతా క్యూనెట్ సంస్థలో(Qnet company) ఏజెంట్లు ఉన్నట్లు

Swapnalok Complex: BM5 సెంటర్ పేరుతో కాల్ సెంటర్..తెర వెనుక క్యూనెట్ ఎంఎల్ఎం దందా

Hyderabad: స్వప్నలోక్ కాంప్లెక్స్ ఘటనపై పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతులంతా క్యూనెట్ సంస్థలో(Qnet company) ఏజెంట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పేరుకు BM5 సెంటర్ పేరుతో కాల్ సెంటర్ నిర్వహిస్తున్నారని, తెర వెనుక క్యూనెట్ ఎంఎల్ఎం(MLM) దందా ఉన్నట్లు తెలిపారు. యువత జీవితాలతో క్యూనెట్(Qnet) చెలగాటం ఆడుతుందన్నారు. మొత్తం 40 క్యూనెట్‌లో పనిచేస్తున్నట్లు గుర్తించారు. రూ. లక్షలు కట్టించుకుని కమీషన్ల పేరుతో..యువత జీవితాల్లో క్యూనెట్ సంస్థ చీకట్లు నింపిందన్నారు. ఇటీవల స్వప్నలోక్ కాంప్లెక్స్(Swapnalok Complex) ఘటనలో మృతి చెందిన ప్రశాంత్ క్యూనెట్‌కు రూ.2.50లక్షలు చెల్లించాడు. ప్రశాంత్ కోసం తల్లిదండ్రులు రూ.2.5లక్షలు ఇవ్వడానికి నానా కష్టాలు పడి.. పత్తిని గిట్టుబాటు ధర లేకున్నా అమ్మి.. వచ్చిన డబ్బులు సరిపోకవడంతో ఊర్లో అప్పు తీసుకువచ్చి మరి ఇచ్చారని తల్లిదండ్రులు వాపోయినట్లు పోలీసులు తెలిపారు. చేతికి వచ్చిన కొడుకు మంచిగా ఓ ఉద్యోగంలో స్థిరపడతాడుకున్న తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చాడు. అంతేకాదు..యువతి శ్రావణి కూడా స్నేహితుల దగ్గర అప్పు చేసి మరి క్యూనెట్‌ సంస్థకు రూ.3లక్షలు చెల్లించినట్లు పోలీసులు వెల్లడించారు.

Updated Date - 2023-03-18T12:45:00+05:30 IST