Durgam Chinnayya Victim: మళ్లీ ఆస్పత్రిలో చేరిన దుర్గం చిన్నయ్య బాధితురాలు

ABN , First Publish Date - 2023-06-30T10:33:47+05:30 IST

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు శేజల్ మరోసారి ఆస్పత్రిలో చేరారు. తనకు న్యాయం జరగడం లేదంటూ నిన్న(గురువారం) శేజల్ రెండో సారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. ఈరోజు ఉదయమే శేజల్‌ను పోలీసులు డిశ్చార్జ్ చేయించి తీసుకెళ్లారు. లాంకోహిల్స్‌లోని శేజల్ నివాసం వద్ద వదిలి వెళ్లారు. అయితే పోలీసులు బలవంతంగా తనను డిశ్చార్జ్ చేసి ఇంటికి తరలించారని బాధితురాలు ఆరోపించారు.

Durgam Chinnayya Victim: మళ్లీ ఆస్పత్రిలో చేరిన దుర్గం చిన్నయ్య బాధితురాలు

హైదరాబాద్: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య (BRS MLA Durgam Chinnayya) బాధితురాలు శేజల్ (Sejal) మరోసారి ఆస్పత్రిలో చేరారు. తనకు న్యాయం జరగడం లేదంటూ నిన్న(గురువారం) శేజల్ రెండో సారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. ఈరోజు ఉదయమే శేజల్‌ను పోలీసులు డిశ్చార్జ్ చేయించి తీసుకెళ్లారు. లాంకోహిల్స్‌లోని శేజల్ నివాసం వద్ద వదిలి వెళ్లారు. అయితే పోలీసులు బలవంతంగా తనను డిశ్చార్జ్ చేసి ఇంటికి తరలించారని బాధితురాలు ఆరోపించారు. తన ఆరోగ్యం కుదుట పడలేదని మళ్లీ మాదాపూర్ ఆసుపత్రిలో చేరారు. తనకు తీవ్రమైన కడుపునొప్పి వస్తోందని అన్నారు. తనకు న్యాయం జరగకపోతే చనిపోతానని మరోసారి శేజల్ హెచ్చరించారు.

నిన్న ఏం జరిగిందంటే...

కాగా.. నిన్న పెద్దమ్మ గుడి వద్ద రోడ్డుపై శేజల్ అపస్మారక స్థితిలో పడివున్నారు. ఆమె బ్యాగులో నిద్రమాత్రలు, సూసైడ్ నోట్‌ను పోలీసులు గుర్తించారు. మధ్యాహ్నం 1:30 గంటలకు పెద్దమ్మ గుడి వద్ద శేజల్‌ను ఆదినారాయణ అనే వ్యక్తి వదిలి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. తెలంగాణ సర్కారు తనకు న్యాయం చేస్తుందన్న నమ్మకం లేదని శేజల్ సూసైడ్ లెటర్‌లో పేర్కొన్నారు. మాదాపూర్ వద్ద రోడ్డుపై శేజల్ నిద్రమాత్రలు మింగిననట్లు పోలీసులు తెలిపారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకున్నానని ఆమె పేర్కొన్నారు.

ఢిల్లీలోనూ కొన్నిరోజుల క్రితం శేజల్ ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. సూసైడ్ నోట్‌లో శేజల్ సంచలన విషయాలను ప్రస్తావించింది. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను లైంగికంగా వేధించాడని శేజల్ ఆరోపిస్తున్నారు. 6 నెలల నుంచి న్యాయం కోసం పోరాటుతున్నట్లు సూసైడ్ నోట్‌లో శేజల్ పేర్కొన్నారు. ప్రభుత్వ పెద్దలు న్యాయం చేస్తామని మాట తప్పారని ఆమె ఆరోపించారు.

Updated Date - 2023-06-30T10:34:07+05:30 IST