Share News

Betting: తెలంగాణ ఎన్నికలపై జోరుగా బెట్టింగ్..

ABN , First Publish Date - 2023-11-29T12:03:07+05:30 IST

తెలంగాణ ఎన్నికలపై బెట్టింగ్ దందా జోరుగా సాగుతోంది. ఇప్పటికే రూ. 2,500 కోట్లకుపైగా దాందా సాగినట్లు సమాచారం. గురువారం సాయంత్రం విడుదలయ్యే ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఫలితాలు వెలువడే డిసెంబర్ 3వ తేదీ వరకు బెట్టింగ్ దందా రూ. 10వేల కోట్లు దాటిటినా ఆశ్చర్యం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Betting: తెలంగాణ ఎన్నికలపై జోరుగా బెట్టింగ్..

హైదరాబాద్: తెలంగాణ ఎన్నికలపై (Telangana Election) బెట్టింగ్ (Betting) దందా జోరుగా సాగుతోంది. ఇప్పటికే రూ. 2,500 కోట్లకుపైగా దాందా సాగినట్లు సమాచారం. గురువారం సాయంత్రం విడుదలయ్యే ఎగ్జిట్ పోల్స్ (Exitpolls) తర్వాత ఫలితాలు వెలువడే డిసెంబర్ 3వ తేదీ వరకు బెట్టింగ్ దందా రూ. 10వేల కోట్లు దాటిటినా ఆశ్చర్యం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నెల క్రితమే ఏపీలోని పలు ప్రాంతాల్లో తెలంగాణ ఎన్నికలపై బెట్టింగులు సాగుతున్నాయని రూ. వెయ్యికోట్ల దందా జరిగినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. హైదరాబాద్ లేదా తెలంగాణలో బెట్టింగ్ నిర్వహిస్తే పట్టుబడే అవకాశం ఉందని గుర్తించిన బుకీలు.. ఇతర ప్రాంతాల నుంచి దందా సాగిస్తున్నట్లు సమాచారం.

ఏపీ, ముంబై, ఢిల్లీ, కోల్‌కతతోపాటు దేశంలోని పలు ఇతర నగరాల నుంచి ఇది జరుగుతున్నట్లు తెలుస్తోంది. కొందరు బుకీలు లండన్, అమెరికాల నుంచి యాప్‌ల ద్వారా బెట్టింగులు నిర్వహిస్తున్నట్లు తెలియవచ్చింది. ముఖ్యంగా ఒక పార్టీ గెలుపుపై రెట్టింపు పందేలు జరుగుతున్నాయి. అంటే ఆ పార్టీపై రూ. లక్ష కాస్తే.. అవతలవాళ్లు రూ. 2 లక్షలు ఇవ్వాలన్నమాట. డిసెంబర్ 3న కౌంటింగ్ జరిగింతవరకు బెట్టింగులు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

కాగా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్దం చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బద్రతా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల విధుల్లో రాష్ట్ర పోలీసులు లక్షమంది సిబ్బందితోపాటు కేంద్ర బలగాలను కూడా రంగంలోకి దించారు. సమస్యాత్మక, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అదనపు బలగాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ ఎన్నికల విధుల్లో 375 కంపెనీల కేంద్ర బలగాలు విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 35,655 ప్రాంతాల్లో పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 4,400 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించి అదనంగా సిబ్బందిని నియమించారు.

అస్సాం రైఫిల్స్, బోర్డర్స్ సెక్యూరిటీ ఫోర్స్ , సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ , సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఎన్నికల విధుల్లో ఉన్నారు. పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌లను బద్రతా సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకోనున్నారు. ఇక్కడ విధులు నిర్వహించేందుకు ఇతర రాష్టాల నుంచి హోంగార్డు సిబ్బంది వచ్చారు.

Updated Date - 2023-11-29T12:06:46+05:30 IST