TS NEWS: శాసనమండలిలో నాలుగు బిల్లులకు ఆమోదం

ABN , First Publish Date - 2023-08-05T18:04:06+05:30 IST

శాసనమండలిలో (Legislative Council) నాలుగు బిల్లులకు (bills) ఆమోదం లభించింది. గతంలో ఉభయసభలు ఆమోదించిన బిల్లులను గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్ (Governor Tamil Sai Soundararajan) తిప్పిపంపారు. గవర్నర్ తిప్పిపంపి‌న బిల్లులను మరోసారి శాసన మండలిలో ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించారు.

TS NEWS: శాసనమండలిలో నాలుగు బిల్లులకు ఆమోదం

హైదరాబాద్: శాసనమండలిలో (Legislative Council) నాలుగు బిల్లులకు (bills) ఆమోదం లభించింది. గతంలో ఉభయసభలు ఆమోదించిన బిల్లులను గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్ (Governor Tamil Sai Soundararajan) తిప్పిపంపారు. గవర్నర్ తిప్పిపంపి‌న బిల్లులను మరోసారి శాసన మండలిలో ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించారు.

శాసనమండలిలో ఆమోదం తెలిపిన బిల్లులు

1.మున్సిపాలిటీలలో కోఆప్షన్‌ సభ్యుల సంఖ్య 5 నుంచి 15కు పెంపు బిల్లు

2. వైద్య ప్రొఫెసర్ల పదవీకాలం పొడగింపు బిల్లు,

3. ప్రైవేటు వర్సిటీల బిల్లు

4. భద్రాచలం జీపీని కొత్తగా మరో రెండు జీపీలుగా ఏర్పాటు చేయడం

సహా నాలుగు బిల్లులకు శాసనమండలి ఆమోదం తెలిపింది. కాగా శాసనమండలి రేపటకి వాయిదా పడింది. రేపు ఉదయం 10గంలకు శాసనమండలి తిరిగి సమావేశంకానున్నది.

Updated Date - 2023-08-05T18:31:28+05:30 IST