Share News

Hyderabad Metro: న్యూ ఇయర్ సందర్భంగా మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త

ABN , Publish Date - Dec 30 , 2023 | 07:49 PM

Hyderabad Metro: న్యూఇయర్ వేడుకలు జరుపుకునే హైదరాబాద్ వాసులకు మెట్రో రైల్ అధికారులు శుభవార్త చెప్పారు. కొత్త సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకు రైళ్లను నడపాలని మెట్రో రైలు నిర్ణయించిందని తెలిపారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.

Hyderabad Metro: న్యూ ఇయర్ సందర్భంగా మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త

న్యూఇయర్ వేడుకలు జరుపుకునే హైదరాబాద్ వాసులకు మెట్రో రైల్ అధికారులు శుభవార్త చెప్పారు. కొత్త సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకు రైళ్లను నడపాలని మెట్రో రైలు నిర్ణయించిందని తెలిపారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. డిసెంబర్ 31 ఆదివారం రాత్రి హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసుల సమయాన్ని పొడిగించినట్లు తెలిపారు. రేపు అర్ధరాత్రి 12.15 గంటల వరకు మెట్రో సర్వీసులు నడుపుతున్నామని మెట్రో రైలు ఎండీ వెల్లడించారు. చివరి రైలు ఆయా స్టేషన్ల నుంచి 12.15 నిమిషాలకు బయలుదేరుతుందని.. అర్ధరాత్రి ఒంటి గంటకు ఈ రైలు గమ్యస్థానానికి చేరుకుంటుందని తెలిపారు.

రెడ్, బ్లూ, గ్రీన్ లైన్‌లలో అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు నడుస్తాయని మెట్రో రైలు ఎండీ చెప్పారు. అయితే మెట్రో రైలు సమయాన్ని పెంచడంతో ఈ సమయంలో భద్రత విషయంలో ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. మెట్రో రైలు, స్టేషన్లలో సిబ్బంది, పోలీసుల నిఘా ఉంటుందని పేర్కొన్నారు. ప్రయాణికులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. మెట్రో స్టేషన్లలోకి మద్యం తాగి వచ్చినా, దుర్భాషలాడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా సాధారణంగా ఉ.6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మెట్రో రైళ్లు నడుస్తున్నాయి.


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Dec 30 , 2023 | 07:50 PM