Heavy Rain: హైదరాబాద్‌లో భారీ వర్షం
ABN , First Publish Date - 2023-06-21T19:39:02+05:30 IST
హైదరాబాద్ (Hyderabad) వ్యాప్తంగా ఆకాశం మేఘావృతం అయింది. నగర వ్యాప్తంగా మబ్బులు దట్టంగా కమ్ముకున్నాయి. దీంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కొద్ది రోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి.
హైదరాబాద్: హైదరాబాద్ (Hyderabad) వ్యాప్తంగా ఆకాశం మేఘావృతం అయింది. నగర వ్యాప్తంగా మబ్బులు దట్టంగా కమ్ముకున్నాయి. దీంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కొద్ది రోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. బయటకు రావాలంటేనే హడలెత్తిపోయేవారు. అలాంటిది ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో భాగ్యనగరవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నగరంలో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షం పడింది. గోల్కొండ, మెహదీపట్నం, షేక్‌పేట్, ఫిలీంనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, రాయదుర్గం, ముషీరాబాద్, చిక్కడపల్లి, నారాయణగూడ, హిమాయత్ నగర్ అబిడ్స్, కోఠి, బేగంబజార్, నాంపల్లిలో భారీ వర్షం పడింది. ఆఫీసుల నుంచి ఇంటికి బయలుదేరిన ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షానికి రహదారులు జలమయమవ్వడంతో భారీగా ట్రాఫిక్ జాం అయింది. నగరంలో సాయంత్రం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారింది. కుండపోత వర్షానికి నగరంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.