Share News

Elections: 27న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు

ABN , First Publish Date - 2023-12-05T08:33:43+05:30 IST

అసెంబ్లీ ఎన్నికల పక్రియ ముగియడంతో మినీ సార్వత్రిక ఎన్నికల సంరంబాన్ని తలపించే సింగరేణి

Elections: 27న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు

ఇల్లెందు(సింగరేణి): అసెంబ్లీ ఎన్నికల పక్రియ ముగియడంతో మినీ సార్వత్రిక ఎన్నికల సంరంబాన్ని తలపించే సింగరేణి కార్మికసంఘాల ఎన్నికలు 27వ తేదీన నిర్వహించడానికి నిర్ణయించారు. ఈ మేరకు సింగరేణి కాలరీస్‌(Singareni Calories) కార్మికసంఘాల ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా వ్వవహరిస్తున్న డిప్యూటీ చీఫ్‌ లేబర్‌ కమిషనర్‌(సెంట్రల్‌) డీ.శ్రీనువాసులు సోమవారం కార్మికసంఘాలతో సింగరేణి అధికారు లతో సమావేశం నిర్వహించారు. అక్టోబరులోనే సింగరేణి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించి నామినేషన్ల స్వీకరణ, ఎన్నికల చిహ్నాల కేటాయింపు జరిపినా శాసనసభ ఎన్నికల వల్ల హైకోర్టు సూచన మేరకు సింగరేణి ఎన్నికల ప్రక్రియను వాయిదావేశారు. ప్రస్తుతం ఎన్నికలు పూర్తికావడంతో సోమవారం సింగరేణి ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. ఈ మేరకు కార్మికసంఘాలకు డ్రాప్టు ఓటర్ల జాబితాలను సింగరేణి యజమాన్యం ప్రకటించడంతో రిటర్నింగ్‌ అధికారి పోటిలో ఉన్న కార్మికసంఘాలకు అందజేశారు.

ఈ జాబితా ప్రకారం సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో 39,991మంది కార్మికులు ఉన్నారు. ఓటర్ల జాబితాలపై అభ్యంతరాలు ఉంటే 6వ తేదీ వరకు తెలపాలని, 7న అభ్యంతరాల పరిశీలన జరిపి 8వ తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నట్లు రిటర్నింగ్‌ అధికారి షెడ్యూల్‌ జారీ చేశారు. డిసెంబరు 27వరకు సింగరేణి కాలరీస్‌ ఉద్యోగులు గా రికార్డుల్లో ఉన్న కార్మికులు, ఉద్యోగులకే ఓటు హక్కు కల్పిస్తున్నట్లు రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు.

Updated Date - 2023-12-05T08:36:07+05:30 IST