2022 ఏడాదికి విద్యాసంస్థల ర్యాంకింగ్స్ విడుదల.. ఓయూ ఏ స్థానంలో ఉందంటే..

ABN , First Publish Date - 2023-06-05T13:00:42+05:30 IST

2022 సంవత్సరానికి విద్యాసంస్థల ర్యాంకింగ్స్‌ను కేంద్రం విడుదల చేసింది. ఓవరాల్ ర్యాంకింగ్స్‌లో ఐఐటీ-మద్రాస్ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో ఐఐఎస్సీ-బెంగళూరు, ఐఐటీ-బాంబే, ఐఐటీ-ఢిల్లీ ఉన్నాయి. 10వ స్థానంలో జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఉంది. యూనివర్సిటీల ర్యాంకింగ్‌లో మొదటి స్థానంలో ఐఐఎస్సీ-బెంగళూరు, రెండో స్థానంలో జేఎన్యూ-న్యూఢిల్లీ, మూడో స్థానంలో జామియా మిలియా యూనివర్సిటీ-న్యూఢిల్లీ ఉన్నాయి. 10వ స్థానంలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఉంది.

2022 ఏడాదికి విద్యాసంస్థల ర్యాంకింగ్స్ విడుదల.. ఓయూ ఏ స్థానంలో ఉందంటే..

ఢిల్లీ : 2022 సంవత్సరానికి విద్యాసంస్థల ర్యాంకింగ్స్‌ను కేంద్రం విడుదల చేసింది. ఓవరాల్ ర్యాంకింగ్స్‌లో ఐఐటీ-మద్రాస్ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో ఐఐఎస్సీ-బెంగళూరు, ఐఐటీ-బాంబే, ఐఐటీ-ఢిల్లీ ఉన్నాయి. 10వ స్థానంలో జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఉంది. యూనివర్సిటీల ర్యాంకింగ్‌లో మొదటి స్థానంలో ఐఐఎస్సీ-బెంగళూరు, రెండో స్థానంలో జేఎన్యూ-న్యూఢిల్లీ, మూడో స్థానంలో జామియా మిలియా యూనివర్సిటీ-న్యూఢిల్లీ ఉన్నాయి. 10వ స్థానంలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఉంది. ఎన్ఐటీ - వరంగల్ కి ఓవరాల్ ర్యాంకింగ్‌లో 45వ స్థానం, 46వ స్థానంలో ఉస్మానియా యూనివర్సిటీ, యూనివర్సిటీల విభాగంలో ఉస్మానియా యూనివర్సిటీకి 22వ స్థానం, ఆంధ్రా యూనివర్సిటీకి 36వ స్థానాన్ని కేంద్రం కల్పించింది.

ఇంజనీరింగ్ విభాగంలో మొదటి స్థానంలో ఐఐటీ (మద్రాస్), 10వ స్థానంలో ఐఐటీ (హైదరాబాద్), 21వ స్థానంలో ఎన్ఐటీ (వరంగల్), మేనేజ్మెంట్ విభాగంలో అగ్రస్థానంలో ఐఐఎం-అహ్మదాబాద్, రెండో స్థానంలో ఐఐఎం-బెంగళూరు, ఫార్మసీ విభాగంలో మొదటి స్థానంలో జామియా హమ్‌దర్ద్ (న్యూఢిల్లీ), రెండోస్థానంలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (హైదరాబాద్), ఆర్కిటెక్చర్ విభాగంలో మొదటి స్థానంలో ఐఐటీ-రూర్కీ, 7వ స్థానంలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (విజయవాడ), లా విభాగంలో మొదటి స్థానంలో నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (బెంగళూరు), 4వ స్థానంలో నల్సార్ యూనివర్సిటీ (హైదరాబాద్), డెంటల్ విభాగంలో సవీత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నికల్ సైన్సెస్ (చెన్నై), రెండో స్థానంలో మణిపాల్ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ (మణిపాల్), వైద్య విద్య విభాగంలో మొదటిస్థానంలో ఎయిమ్స్ (న్యూఢిల్లీ), రెండోస్థానంలో PGIMER (చండీగఢ్), 3వ స్థానంలో క్రిస్టియన్ మెడికల్ కాలేజీ (వేలూరు) ఉన్నాయి.

Updated Date - 2023-06-05T13:21:34+05:30 IST