Delhi Liquor Scam : కవిత మాజీ ఆడిటర్‌ను విచారిస్తున్న ఈడీ.. రేపటి విచారణకు బుచ్చిబాబు వాంగ్మూలమే కీలకం

ABN , First Publish Date - 2023-03-15T14:03:39+05:30 IST

ఢిల్లీ లిక్కర్ స్కాం మనీ లాండరింగ్ కేసులో కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు ఈడీ ఎదుట హాజరయ్యారు. లిక్కర్ వ్యాపారి అరుణ్ పిళ్ళై , గోరంట్ల బుచ్చిబాబును కలిపి ఈడీ ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది.

Delhi Liquor Scam : కవిత మాజీ ఆడిటర్‌ను విచారిస్తున్న ఈడీ.. రేపటి విచారణకు బుచ్చిబాబు వాంగ్మూలమే కీలకం

ఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam) మనీ లాండరింగ్ కేసులో కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు (Gorantla Butchibabu) ఈడీ (ED) ఎదుట హాజరయ్యారు. లిక్కర్ వ్యాపారి అరుణ్ పిళ్ళై (Arun Pillai) , గోరంట్ల బుచ్చిబాబు (Gorantla Butchibabu)ను కలిపి ఈడీ ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. లిక్కర్ పాలసీ రూపకల్పన, హోటల్స్‌లో జరిగిన సమావేశాలు, డ్రాఫ్ట్ పాలసీ ముందుగా నిందితులకు రావడం, 100 కోట్ల ముడుపుల వ్యవహారాలు, ఆధారాల ధ్వంసం సహా అనేక అంశాలపై నిందితుల నుంచి ఈడీ సమాధానాలు రాబట్టనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఫిబ్రవరి 28వ తేదీ తిహార్ జైలులో బుచ్చిబాబు నుంచి కీలక సమాచారాన్ని ఈడీ రాబట్టింది. రేపటి కవిత విచారణకు నేటి అరుణ్ పిళ్ళై, బుచ్చిబాబు వాంగ్మూలాలు కీలకం కానున్నాయి.

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్‌ గోరంట్ల బుచ్చిబాబును కొద్ది రోజుల క్రితమే సీబీఐ అరెస్టు చేసింది. ఈ కేసులో తెలంగాణ నుంచి అభిషేక్‌ బోయినపల్లి తర్వాత సీబీఐ అరెస్టు చేసిన రెండో వ్యక్తి బుచ్చిబాబే కావడం గమనార్హం. గతంలో కూడా ఈడీ బుచ్చిబాబును పలుమార్లు ప్రశ్నించిన అనంతరం సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు ప్రవేశపెట్టారు. కోర్టు ఆయనకు కస్టడీ విధించింది. పంజాబ్‌కు చెందిన వ్యాపారవేత్త గౌతమ్‌ మల్హోత్రాను కూడా ఢిల్లీ మద్యం కేసులో ఈడీ బుధవారం అరెస్టు చేసింది.

ఢిల్లీ ఎక్సైజ్‌ విధానం రూపకల్పన, అమలులో బుచ్చిబాబు కీలక పాత్ర పోషించారని, దాని వల్ల హైదరాబాద్‌కు చెందిన హోల్‌ సేల్‌, రిటైల్‌ లైసెన్సీలకు, వారి ద్వారా ప్రయోజనం పొందిన వారికి అక్రమ లాభాలు సమకూరాయని సీబీఐ ఒక ప్రకటనలో తెలిపింది. కవిత జాగృతి సంస్థ ఏర్పాటు చేసినప్పటి నుంచీ ఆమె ఆడిటర్‌గా ఉన్న బుచ్చిబాబు.. మంత్రి కేటీఆర్‌కు, ఆయన సన్నిహిత నేతలకు కూడా ఆడిటర్‌గా పనిచేశారు. కాగా, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి, సౌత్‌ గ్రూప్‌లో కవిత, శరత్‌ చంద్రారెడ్డిలకు ప్రాతినిధ్యం వహిస్తున్న అరుణ్‌ రామచంద్ర పిళ్ల్లై సీబీఐకి అప్రూవర్‌గా మారే అవకాశాలున్నాయని, ఆయన సీబీఐ, ఈడీకి కీలక వివరాలు అందించారని సమాచారం.

Updated Date - 2023-03-15T14:03:39+05:30 IST