Allu Arjun : ఈ సారి నాగార్జున సాగర్ నుంచి పోటీ చేస్తానంటున్న అల్లు అర్జున్ మామ

ABN , First Publish Date - 2023-08-19T09:27:50+05:30 IST

వచ్చే ఎన్నికల్లో అవకాశం ఇస్తే నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి బరిలో ఉంటానని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. నేడు అల్లు అర్జున్ అల్లుడుగా మాతో ఆప్యాయంగా ఎంతో కలివిడిగా ఉంటారు. మెగా కుటుంబంలో భాగమైనందుకు సంతోషంగా ఉన్నామన్నారు.

Allu Arjun : ఈ సారి నాగార్జున సాగర్ నుంచి పోటీ చేస్తానంటున్న అల్లు అర్జున్ మామ

నల్గొండ : వచ్చే ఎన్నికల్లో అవకాశం ఇస్తే నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి బరిలో ఉంటానని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. నేడు అల్లు అర్జున్ అల్లుడుగా మాతో ఆప్యాయంగా ఎంతో కలివిడిగా ఉంటారు. మెగా కుటుంబంలో భాగమైనందుకు సంతోషంగా ఉన్నామన్నారు. దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న అల్లు అర్జున్ సేవలు రాజకీయంగా అవసరమన్నారు. 2014లో తాను కొత్తదైన ఇబ్రహీంపట్నం నుంచి పోటీ చేశానని.. అప్పట్లో అర్జున్ తనకు ప్రచారం చేయలేదన్నారు. తన స్వంత నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నానన్నారు. తన కోసం ఈసారి అల్లు అర్జున్ ప్రచారం చేస్తారని చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు.

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గానికి సినీ హీరో అల్లు అర్జున్ రానున్నారు. పెద్దవూర మండలం భట్టుగూడెం వద్ద తన మామ, బీఆర్ఎస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించిన ఫంక్షన్ హాల్‌ను అల్లు అర్జున్ ప్రారంభించనున్నారు. అల్లు అర్జున్ రాక నేపథ్యంలో మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవానికి మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు రానున్నారు. 2014లో ఇబ్రహీంపట్నం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి పోటీ చేశారు. కొన్నాళ్లుగా సాగర్ నియోజకవర్గంలో చంద్రశేఖర్ రెడ్డి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Updated Date - 2023-08-19T09:27:50+05:30 IST