Chikoti Praveen : థాయిలాండ్‌లో అసలేం జరిగిందో పూసగుచ్చినట్లుగా చెప్పేసిన చికోటి ప్రవీణ్..

ABN , First Publish Date - 2023-05-02T20:51:44+05:30 IST

క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ కుమార్ (Chikoti Praveen Kumar ) గ్యాంబ్లింగ్ వ్యవహారంలో థాయిలాండ్‌లో (Thailand) అరెస్టయ్యి ఒక్కరోజు వ్యవధిలోనే బెయిల్‌పై బయటికొచ్చారు..

Chikoti Praveen : థాయిలాండ్‌లో అసలేం జరిగిందో పూసగుచ్చినట్లుగా చెప్పేసిన చికోటి ప్రవీణ్..

క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ కుమార్ (Chikoti Praveen Kumar ) గ్యాంబ్లింగ్ వ్యవహారంలో థాయిలాండ్‌లో (Thailand) అరెస్టయ్యి ఒక్కరోజు వ్యవధిలోనే బెయిల్‌పై బయటికొచ్చారు. ఆయనతో పాటు 87 మంది భారతీయులకు షరతులతో కూడిన బెయిల్‌ను థాయ్ కోర్టు మంజూరు చేసింది. అరెస్ట్ అయిన వారంతా ఒక్కొక్కరు 4500 రూపాయిలు ఫైన్ చెల్లించిన తర్వాత పోలీసుల అదుపులో నుంచి బయటికి వచ్చారు. ఇవాళ రాత్రికి వీళ్లంతా ఇండియాకు తిరుగుపయనం కానున్నారు. అయితే అరెస్ట్ తర్వాత మొదటిసారిగా తెలుగు మీడియాతో ఫోన్‌లో మాట్లాడిన పలు కీలక విషయాలను వెల్లడించారు. అసలు ఆయన ఎందుకు థాయిలాండ్ వెళ్లారు..? ఎవరి పిలుపు మేరకు వెళ్లాల్సి వచ్చింది..? అక్కడికెళ్లాక అరెస్ట్ దాకా ఎందుకెళ్లింది..? అనే విషయాలపై బెయిల్‌పై బయటికొచ్చిన చికోటి స్పందించారు.

Chikoti-Praveen-Arrest.jpg

నాకు తెలియదు..!

గ్యాంబ్లింగ్ వ్యవహారంలో నాకు ఏ పాపం తెలియదు. నేను ఆర్గనైజర్‌ కాదు.. నాపేరు ఎక్కడా లేదు. దేవ్‌, సీత నాకు ఆహ్వానం పంపితేనే థాయిలాండ్‌ వెళ్లాను. 4 రోజులు ఫోకర్న్ టోర్నమెంట్ అన్నారు. ఆ టోర్నమెంట్ లీగల్ అని నాకు లేఖ కూడా పంపారు. అందులో స్టాంప్‌లు కూడా పంపారు. నేను హాల్‌లోకి వెళ్లిన 10 నిమిషాలకే రైడింగ్ జరిగింది. థాయ్‌లాండ్‌లో పోకర్ ఇల్లీగల్ అని నాకు తెలియదు అని చికోటి చెప్పుకొచ్చారు. థాయిలాండ్‌లో గ్యాంబ్లింగ్ నిషేధం కావడంతో కచ్చితంగా కఠిన శిక్ష పడుతుందని అక్కడ పట్టుబడిన వారి కుటుంబీకులు ఆందోళన చెందారు. ఎందుకంటే అక్కడ చిన్నపాటి నేరం చేసినట్లు రుజువైతేనే కఠిన శిక్షలు ఉంటాయి. నిషేధం విధించిన గ్యాంబ్లింగ్ ఆటాడుతూ భారతీయులు దొరికిపోవడంతో ఏం జరుగుతుందో అని కుటుంబీకులు భయపడిపోయారు.

Chikoti-1.jpg

అరెస్ట్ ఇలా..!?

బాంగ్‌ లాముంగ్‌ జిల్లాలోని ఆసియా పట్టాయా హోటల్‌లో ఓ 4-స్టార్‌ హోటల్‌లో క్యాసినో, జూదం నిర్వహిస్తుండగా.. ఉప్పందుకున్న థాయ్‌లాండ్‌ పోలీసులు స్పెషల్‌ ఆపరేషన్‌ చేపట్టి.. చీకోటి ప్రవీణ్‌, అతని అనుచరుడు మాధవరెడ్డి, మెదక్‌ డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌ రెడ్డి సహా 87 మంది భారతీయులను అరెస్టు చేశారు. ఇతర దేశాలకు చెందిన వారితో కలిపి మొత్తం 100 మందికి పైగా అరెస్టు చేయగా.. వీరిలో 19 మంది యువతులున్నారు. ఆసియా పట్టాయ స్టార్‌ హోటల్‌లో భారతీయ ముఠా ఒకటి జూదం నిర్వహిస్తోందని థాయ్‌ నిఘా సంస్థ ద్వారా అక్కడి పోలీసులకు ఉప్పందింది. గత నెల 27న మకాం వేసినట్లు తెలిసినప్పటి నుంచి మేజర్‌ జనరల్‌ కాంపోల్‌ లీలా ప్రపాపర్న్‌, పట్టాయా సిటీ పోలీస్‌ కమిషనర్‌ చోన్బురీ, లెఫ్టినెంట్‌ కల్నల్‌ శాంతి కోర్కాసెమ్‌, లెఫ్టినెంట్‌ కల్నల్‌ థానోపాంగ్‌ ఫోతీ, ఇమిగ్రేషన్‌ విభాగం అధికారులు నిఘా పెట్టారు. జూదం, క్యాసినో కొనసాగుతున్న తీరును ఎప్పటికప్పుడు గమనిస్తూ.. జూద నిర్వాహకులు, జూదగాళ్లు భారత్‌కు తిరిగి వెళ్లే రోజున దాడి చేయాలని పక్కాగా ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. సోమవారం ఉదయం జూదగాళ్లు, నిర్వాహకులు భారత్‌కు తిరిగి వెళ్లనుండడంతో.. ఆదివారం అర్ధరాత్రి దాటాక ‘ఆపరేషన్‌’ను ప్రారంభించారు. పైన పేర్కొన్న ఉన్నతాధికారులతోపాటు.. 100 మందికి పైగా పట్టాయ పోలీసులు ఏడంతస్తుల ఆ స్టార్‌హోటల్‌ను చుట్టు ముట్టారు. హోటల్‌లో మొత్తం 300 గదులు ఉండగా.. భారతీయులు, జూదగాళ్లు దిగిన గదులతోపాటు.. జూదం నిర్వహిస్తున్న కాన్ఫరెన్స్‌ హాల్‌లో దాడులు జరిపారు. పోలీసులను చూడగానే జూదగాళ్లు ఎక్కడికక్కడ పారిపోవడానికి ప్రయత్నించినా.. సాధ్యం కాలేదు.

Chikoti.jpg

కాగా.. థాయిలాండ్‌లో ఈ గ్యాంబ్లింగ్ నిర్వహించింది ప్రవీణే అని పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అంతేకాదు.. ఈయనే కోట్ల రూపాయిలతో అక్కడికి వెళ్లారని.. ఆటలో పాల్గొనే ఒక్కొక్కర్నుంచి లక్షల్లో నగదు తీసుకున్నారని కూడా ఆరోపణలు వచ్చాయి. భారత్‌లో డబ్బులు చెల్లిస్తే థాయ్‌లాండ్‌లో వాటికి సమాన విలువ గల చిప్స్‌ ఇచ్చేలా.. ఆ తర్వాత క్యాసినో, జూదంలో గెలుపొందిన వారి నగదును భారత్‌లో భద్రంగా అప్పగించేలా చీకోటి ప్రవీణ్‌తో ఒప్పందం ఉండడంతో వీరంతా థాయ్‌లాండ్‌ వెళ్లినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ ఏడాది జూన్‌లో నేపాల్‌లో క్యాసినో నిర్వహించనున్నట్లు ఇప్పటికే చీకోటి గ్యాంగ్‌ ప్రచారం చేసుకున్నట్లు కూడా వార్తలు గుప్పుమన్నాయి. ఇలా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో స్పందించిన చికోటి పై విధంగా క్లారిటీ ఇచ్చుకున్నారు.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

Big Breaking : క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్‌కు బెయిల్ మంజూరు.. థాయ్ కోర్టు ఫైన్ ఎంత వేసిందంటే..
******************************

Chikoti Arrest : అరెస్టయిన చికోటి ప్రవీణ్ థాయ్‌లాండ్‌లో గ్యాంబ్లింగ్‌ కోసం ఏ రేంజ్‌లో ప్లాన్ చేశాడో తెలిస్తే..

******************************

Chikoti Praveen : థాయిలాండ్‌లో చికోటి ప్రవీణ్ అరెస్ట్.. 14 మంది మహిళలు కూడా..

******************************

Casino King Chikoti : థాయిలాండ్‌లో చికోటితో పట్టుబడిన వారిలో వైసీపీ నేతలు.. కీలకంగా వ్యవహరించిన మహిళ..!

******************************

Updated Date - 2023-05-02T20:57:13+05:30 IST