Falaknuma Express fire accident: ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదంపై కేసు నమోదు
ABN , First Publish Date - 2023-07-07T22:43:01+05:30 IST
ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్ని ప్రమాదంపై (Falaknuma Express fire accident) అధికారులు కేసు నమోదు (Case registered) చేశారు.
యాదాద్రి: ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్ని ప్రమాదంపై (Falaknuma Express fire accident) అధికారులు కేసు నమోదు (Case registered) చేశారు. నల్గొండ జి.ఆర్.పి స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్ని ప్రమాదం జరిగిందని నిర్ధారించి కేసు నమోదు చేశారు.
యాదాద్రి వద్ద హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలులో (Falaknuma Train Accident ) మంటలు చెలరేగాయి. పగిడిపల్లి - బొమ్మాయిపల్లి వద్ద రైలు బోగీల్లో మంటలు ఎగిసిపడ్డాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్నిప్రమాదం సంభవించినట్లు తొలుత భావించారు. ఈ రోజు రైలు ప్రమాదం జరుగుతుందని నిన్న (గురువారం) దక్షిణ మధ్య రైల్వే అధికారులకు ఓ లేఖ అందించింది.
ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో మొత్తం ఆరు బోగీలు దగ్ధమయ్యాయి. ఎస్-4, ఎస్-5, ఎస్-6, ఎస్-7 బోగీలు కాలి బూడిదయ్యాయి. బోగీల్లో పొగ గమనించగానే లోకో పైలెట్ ట్రైన్‌ను నిలిపివేశారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికులంతా రైలు దిగి వెళ్లిపోయారు. క్షణాల్లోనే రైలు నుంచి దట్టమైన పొగలు ఆ ప్రాంతాన్ని కప్పేశాయి. అగ్నిప్రమాదానికి గురైన బోగీలను రైలు నుంచి విడదీయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో అందరూ సురక్షితంగా బయటపడ్డారని సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపింది