Share News

Akbaruddin Owaisi: అక్బరుద్దీన్ ఒవైసీపై కేసు నమోదు

ABN , First Publish Date - 2023-11-22T18:51:14+05:30 IST

చంద్రాయణగుట్ట ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై సంతోష నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఇన్‌స్పెక్టర్ శివచంద్రపై అక్బరుద్దీన్ అభ్యంతరకర వాఖ్యలు చేసిన నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్ విధులకు ఆటంకం కలిగించడం, వ్యక్తిగతంగా దూషించడంతో పలు సెక్షన్ల కింద అక్బరుద్దీన్ ఒవైసీపై కేసు నమోదు చేశారు.

Akbaruddin Owaisi: అక్బరుద్దీన్ ఒవైసీపై కేసు నమోదు

హైదరాబాద్: చంద్రాయణగుట్ట ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై సంతోష నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. ఇన్‌స్పెక్టర్ శివచంద్రపై అక్బరుద్దీన్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్ విధులకు ఆటంకం కలిగించడం, వ్యక్తిగతంగా దూషించడంతో పలు సెక్షన్ల కింద అక్బరుద్దీన్ ఒవైసీపై కేసు నమోదు చేశారు.

సీఐ శివచంద్ర అక్బరుద్దీన్ ఒవైసీపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. సభ బందోబస్తు కోసం సీఐ వెళ్లారు. సభ సమయం మించిపోవడంతో సీఐ స్టేజ్‌పైకి వెళ్లి రాత్రి 10 గంటల వరకు అనుమతి ఉందన్న విషయాన్ని అక్బరుద్దీన్ ఒవైసీకి చెప్పేందుకు ప్రయత్నించారు. సీఐని చూసి స్పందించిన అక్బరుద్దీన్ ఒవైసీ తనను స్టేజ్‌ నుంచి కిందకు దిగి వెళ్లిపోవాలని.. తన విధులకు ఆటంకం కలిగించారని సీఐ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - 2023-11-22T19:13:16+05:30 IST