Basara IIIT: బాసర ఆర్జీయూకేటీ ప్రవేశ దరఖాస్తు గడువు పొడిగింపు

ABN , First Publish Date - 2023-06-19T18:15:58+05:30 IST

బాసర ఆర్జీయూకేటీ (Basara RGUKT) ప్రవేశ దరఖాస్తు గడువు పొడగిస్తున్నట్లు డైరెక్టర్‌ సతీష్‌కుమార్ ప్రకటించారు. జూన్ 19తో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది.

Basara IIIT: బాసర ఆర్జీయూకేటీ ప్రవేశ దరఖాస్తు గడువు పొడిగింపు

నిర్మల్: బాసర ఆర్జీయూకేటీ (Basara RGUKT) ప్రవేశ దరఖాస్తు గడువు పొడగిస్తున్నట్లు డైరెక్టర్‌ సతీష్‌కుమార్ ప్రకటించారు. జూన్ 19తో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. అయితే విద్యార్థుల అభ్యర్థనల మేరకు ఈనెల 22 వరకు దరఖాస్తు స్వీకరణ గడువు పొడిగిస్తున్నట్లు సతీష్‌కుమార్ తెలిపారు. దీంతో అర్హులైన మరికొందరు విద్యార్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. అలాగే దివ్యాంగులు, సీఏపీ, ఎన్‌సీసీ, స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు ఈ నెల 27 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశమిచ్చారు. ఆరేళ్ల కోర్సుల్లో ప్రవేశాలకు ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను జులై 3న విడుదల చేసే అవకాశం ఉందని వర్సిటీ అధికారులు చెబుతున్నారు.

బాసర ఆర్జీయూకేటీలో 2023-24 విద్యా సంవత్సర ప్రవేశాలకు మే 31 నోటిఫికేషన్‌ విడుదల చేశారు. 2023-24 విద్యా సంవత్సరానికి మొత్తం 1650 ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ (ఇంటర్‌+బీటెక్‌) సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ అయింది. జూన్ 5 నుంచి 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. బాసర ఆర్జీయూకేటీలో 1500 సీట్లు ఉండగా.. 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద మరో 150 అదనంగా భర్తీ చేయాలని వర్సిటీ అధికారులు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

Updated Date - 2023-06-19T18:15:58+05:30 IST